Last Updated:
CM Revanth Reddy: అక్రమ మైనింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సీఐడీని విచారణకు ఆదేశించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సహా అన్ని సంబంధిత సంస్థలపై పూర్తి విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు.
CM Revanth Reddy: అక్రమ మైనింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సీఐడీని విచారణకు ఆదేశించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సహా అన్ని సంబంధిత సంస్థలపై పూర్తి విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు.
బీఆర్‌ఎస్ డిమాండ్ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన ‘రాఘవ కన్‌స్ట్రక్షన్స్’ అక్రమ మైనింగ్‌లో పాల్పడిందని హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతల గంగుల, వద్దిరాజు మైనింగ్, సిరిసిల్ల ఇసుక మాఫియాపై కూడా విచారణ జరిపిస్తామని తెలిపారు. సంతోశ్ రావు, ఆయన తండ్రి రవీందర్ రావుపై కూడా విచారణ ఆదేశించినట్లు చెప్పారు.
జూన్ 2 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన మైనింగ్ లీజులపై విచారణ చేపట్టి, నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశంలో సభ్యుల ముందు ఉంచనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హరీశ్ రావు, కేటీఆర్ నాయకత్వంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అలాగే బ్లాక్ మెయిల్ ప్రయత్నాలకు తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. హరీశ్ రావు మైనింగ్ శాఖను తొలుత తన వద్ద ఉంచి అడ్డగోలుగా దోపిడీ పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆ శాఖను కొడుకు కేటీఆర్‌కు అప్పగించారని సీఎం పేర్కొన్నారు. దీని ద్వారా మైనింగ్, ఇసుకలో రాష్ట్రానికి ఆదాయం పెరిగిందని చెప్పారు.
ముందుగా మైనింగ్ శాఖ హరీశ్ రావు వద్ద ఉండేదని ఆయన అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని ఈ విషయంలో కుమారుడు, అల్లుడి మధ్య పంచాయతీ నడిస్తే దీనికి పరిష్కారంగా కేసీఆర్ ఆ శాఖను అల్లుడి వద్ద నుంచి తీసేసి కుమారుడు కేటీఆర్‌కు అప్పగించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. వారి దోపిడీని నిలువరించి మైనింగ్, ఇసుకలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచామని ఈ విషయం ప్రజలకు అర్థం అవుతోందని గ్రహించే బీఆర్‌ఎస్ నేతలు వారికి లొంగని మంత్రులపై కక్ష సాధించి ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మీరు జల్లే బురదకు ఇక్కడ ఎవరూ భయపడరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ ఆస్తి తగాదాల వల్ల తన సొంత చెల్లి కవితను ఇంట్లో నుంచి, పార్టీ నుంచి బయటకు పంపించారని ముఖ్యమంత్రి ఆరోపించారు. శ్రీనివాస్ రెడ్డి బంధువులకు వ్యాపారాలు ఉంటే వాటితో మంత్రి పొంగులేటికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. పొంగులేటిని బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేస్తే అది దిక్కుమాలిన చర్యనే అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులను బ్లాక్ మెయిల్ చేద్దామనుకుంటే అలాంటి పప్పులు ఏవీ ఉడకవని చురకలు అంటించారు. సీఐడీ విచారణ ద్వారా నిజాలు బయటకు తీసి ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు పంపాపు.
Hyderabad,Telangana












