CM Vijay: సీఎం విజయ్‌పై కొడుకు షాకింగ్ కామెంట్స్.. చిన్నప్పటి విషయాలు బయటపెడుతూ ఓపెన్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు. తన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.

News18
News18

కోలీవుడ్ దళపతి, తమిళ సూపర్ స్టార్ విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు తెలుగులో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోల కొడుకులు సాధారణంగా హీరోలుగానే ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తుంటాం. కానీ, విజయ్ తనయుడు జాసన్ సంజయ్ మాత్రం అందుకు భిన్నంగా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాసన్ సంజయ్.. తన కెరీర్, డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

చిన్ననాటి కలలు..  

తనకు చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఎలా కలిగిందో జాసన్ వివరించాడు. “చిన్న వయసులో నాన్నతో పాటు తరచుగా షూటింగ్ సెట్స్‌కి వెళ్లేవాడిని. అక్కడ వాతావరణం, సినిమా తీసే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకునేది. మొదట్లో నేను పైలట్ కావాలని కలలు కన్నాను, ఆ తర్వాత కొన్నాళ్లకు క్రికెటర్ అవ్వాలనిపించింది. కానీ, ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో సినిమాలపై నా ఆసక్తి పూర్తిగా పెరిగింది” అని తెలిపాడు. చిన్నప్పటి నుంచి కథలు అల్లడం, వాటిని స్నేహితులకు చెప్పడం తన హాబీ అని, ఆ తర్వాత వాటిని కాగితంపై రాయడం అలవాటుగా మారిందని చెప్పాడు. తనలోని దర్శకుడిని గుర్తించి, కెనడాలో ఫిల్మ్ మేకింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని, అప్పుడే తాను భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై పూర్తి క్లారిటీ వచ్చిందని జాసన్ స్పష్టం చేశాడు.

ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెబుతూ జాసన్ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు. “మా నాన్న విజయ్ గారిని డైరెక్ట్ చేయడం నా అతిపెద్ద కల. అయితే కేవలం ఆయనతో మాత్రమే కాకుండా, నాన్నతో పాటు హాలీవుడ్ టాప్ యాక్షన్ స్టార్ జాసన్ స్టాథమ్‌ను కలిపి ఒక భారీ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఐడియా వినగానే ఆన్‌లైన్‌లో నాపై ఎన్నో మీమ్స్, ట్రోల్స్ వస్తాయని నాకు ముందే తెలుసు. కానీ, డాడీ మరియు జాసన్ స్టాథమ్ స్క్రీన్ మీద కలిసి కనిపిస్తే ఆ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది” అని తన డ్రీమ్ గురించి ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు.

దర్శకుడిగా తొలి అడుగు:

జాసన్ సంజయ్ ‘సిగ్మా’ (Sigma) అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రావాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల వాయిదా పడినట్లు సమాచారం. దళపతి వారసుడి తొలి సినిమా కావడంతో సౌత్ ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports