Cocktail 2: ‘కాక్‌టెయిల్ 2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా సూపర్.. రష్మిక మందన్నపై షాకింగ్ కామెంట్స్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ నటించిన ‘కాక్‌టెయిల్ 2’పై తొలి సమీక్షలు సానుకూలంగా వచ్చాయి. అద్భుతమైన విజువల్స్, సంగీతం, నటీనటుల ప్రదర్శనతో ఈ చిత్రం విజేతగా నిలుస్తుందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.

News18
News18

బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కాక్‌టెయిల్ 2’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా విడుదలకు ముందే ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన తొలి సమీక్షను వెల్లడించగా, ఈ చిత్రం అంచనాలకు మించి ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా “విన్నర్” అని ఆయన పేర్కొన్నారు. ఫోర్ స్టార్‌ రేటింగ్ ఇస్తూ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2012లో వచ్చిన ‘కాక్‌టెయిల్’కు సీక్వెల్ అయినప్పటికీ, మొదటి భాగంతో పోలికలు లేకుండా కొత్త తరహా ప్రేమకథగా రూపొందించారని తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఆధునిక ప్రేమ కథల స్ఫూర్తిని, భావోద్వేగాలను సమపాళ్లలో మేళవిస్తూ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

లవ్ రంజన్, తరుణ్ జైన్ అందించిన కథ, స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని పేర్కొన్నారు. సంగీతం, విజువల్స్, డైలాగ్స్, భావోద్వేగాలు అన్ని అంశాల్లోనూ సినిమా మంచి మార్కులు కొట్టేసిందని అన్నారు. ముఖ్యంగా ఇటలీ నేపథ్యంలో సాగే ఫస్ట్ హాఫ్ అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. పాటలు, ప్రధాన తారల మధ్య కెమిస్ట్రీ, అనూహ్య ట్విస్టులు ఈ భాగాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయని చెప్పారు.

సెకండాఫ్‌లో డ్రామా మరింత ఉత్కంఠభరితంగా సాగుతుందని, క్లైమాక్స్‌కు ముందు వచ్చే కొన్ని సన్నివేశాలు కొద్దిగా బలహీనంగా అనిపించినప్పటికీ, చివరికి సినిమా పూర్తి సంతృప్తిని కలిగిస్తుందని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.

నటీనటుల విషయానికి వస్తే, షాహిద్ కపూర్ తన కెరీర్‌లో మరో అద్భుతమైన నటనను కనబరిచారని కొనియాడారు. భావోద్వేగ సన్నివేశాలతో పాటు సరదా క్షణాల్లో కూడా ఆయన నటన ఆకట్టుకుంటుందని చెప్పారు. ముఖ్యంగా చివరి దశలో వచ్చే కీలక సన్నివేశాల్లో షాహిద్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుందని వెల్లడించారు.

ఇక కృతి సనన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచారని తరణ్ ప్రశంసించారు. రష్మిక మందన్న పాత్రకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదని, ఆమెకు నటనకు ఎక్కువ అవకాశాలు లభించలేదని అభిప్రాయపడ్డారు. అలాగే హిందీ ఉచ్చారణ విషయంలో రష్మిక మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

దినేశ్ విజన్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హోమీ అదజానియా దర్శకత్వం వహించగా, తరుణ్ జైన్, లవ్ రంజన్ స్క్రీన్‌ప్లే అందించారు. జూన్ 19, 2026న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports