Commonwealth Games 2026: పీరియడ్స్ నొప్పినీ భరిస్తూ.. దేశానికి పతకం తెచ్చిన వీర వనిత! ఇదిగో వీడియో | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ అద్భుతం చేసింది. మహిళల 53 కేజీల విభాగంలో రజత పతకం సాధించి తన తండ్రి కలను నెరవేర్చింది. శారీరక ఇబ్బందులను సైతం లెక్కచేయకుండా పతకం గెలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.

News18
News18

గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 23 ఏళ్ల వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకంతో మెరిసింది. మహిళల 53 కిలోల విభాగంలో ఆమె మొత్తం 199 కిలోల (స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కిలోలు) బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన ఒనోమ్ ఒమోలోలా 206 కిలోల బరువు ఎత్తి స్వర్ణం గెలుచుకోగా, కెనడా క్రీడాకారిణి రెబెకా కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ గేమ్స్‌లో భారత్‌కు వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇది నాలుగో పతకం కాగా, మొత్తంగా ఐదో పతకం. ఈ విజయంతో జ్ఞానేశ్వరి తన తండ్రి దీపక్ యాదవ్ నెరవేర్చుకోలేని కలను నిజం చేసింది. గతంలో బాడీబిల్డర్ కావాలని కలలు కన్న ఆమె తండ్రి, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ కోరికను వదులుకున్నాడు.

నాన్న ప్రోత్సాహంతోనే..

తన ఆశలను కూతురి ద్వారా నెరవేర్చుకోవాలని భావించిన దీపక్.. జ్ఞానేశ్వరికి 13 ఏళ్ల వయసులోనే వెయిట్‌లిఫ్టింగ్ శిక్షణ ఇప్పించాడు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న అతను తన కూతురిలోని ప్రతిభను గుర్తించి కోచ్ అజయ్ లోహర్ విశ్వకర్మ వద్ద చేర్చాడు. వారి ప్రోత్సాహం, తన కఠోర శ్రమతో జ్ఞానేశ్వరి అంచలంచెలుగా ఎదిగి ఈరోజు కామన్వెల్త్ పోడియంపై నిలిచింది.

నెలసరి బాధను తట్టుకుని..

అయితే ఈ అద్భుత విజయానికి ముందు ఆమె పడిన శారీరక బాధ అంతాఇంతా కాదు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. పోటీ ముగిసిన తర్వాత జ్ఞానేశ్వరి మాట్లాడుతూ.. తనకు అది నెలసరి మొదటి రోజు అని చెప్పింది. “ఈరోజు నాకు పీరియడ్స్ మొదలయ్యాయి. నా శరీరం సహకరిస్తుందో లేదో అని చాలా భయపడ్డాను. కానీ నా వంతు శ్రమంతా ధారపోశాను” అని ఆమె వివరించింది. ఇలాంటి కష్ట సమయంలోనూ ఆమె తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం విశేషం.

ఈ పతకం కేవలం 199 కిలోల బరువు ఎత్తడం మాత్రమే కాదు.. మహిళల ఆరోగ్యం చుట్టూ ఉన్న అపోహలను బద్దలు కొట్టడానికి ఒక నిదర్శనం. అడుగడుగునా సవాళ్లు ఎదురైనప్పటికీ, గుండె ధైర్యంతో బరిలోకి దిగి పతకం సాధించిన జ్ఞానేశ్వరి మానసిక దృఢత్వానికి ఈ విజయం అద్దం పడుతోంది. కష్టాల్లోనూ ముందుకు సాగే ధైర్యమే నిజమైన బలం అని ఆమె నిరూపించింది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports