టీ20 ఫార్మాట్ మారిన తీరుకు అనుగుణంగా ఫ్లెమింగ్ తన ఆలోచనలను మార్చుకోలేదని, ఆయన శైలి ఇంకా పాతకాలపు పద్ధతుల్లోనే ఉండిపోయిందనే విమర్శలు ఫ్రాంచైజీలో వినిపించాయి. దానికి భిన్నంగా జహీర్ ఆధునిక ఆలోచనా ధోరణి కలిగిన కోచ్‌గా నిరూపించుకోగలరు. లక్నో జట్టుతో పనిచేసిన సమయంలో “మా జట్టు నుంచి సరికొత్త ఆలోచనలు, భిన్నమైన వ్యూహాలు, గెలవాలనే ఆకలి, పోరాట పటిమను మీరు చూడవచ్చు” అని జహీర్ స్వయంగా పేర్కొన్నారు. ఫ్లెమింగ్ కంటే ఏడేళ్ల తర్వాత రిటైర్ అయిన జహీర్‌కు ఐపీఎల్లో ఎక్కువ ఆడిన అనుభవం ఉంది. టీ20 ఫార్మాట్ డిమాండ్లకు సరిగ్గా సరిపోయే వ్యక్తినే ఫ్రాంచైజీ ఎంచుకుందని స్పష్టమవుతోంది.














