Last Updated:
Delhi Gang Rape Shocker: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దారుణ సంఘటనే ఇందుకు నిదర్శనం. కల్కాజి మందిర సమీపంలోని పార్కులో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. పార్కులోకి చొరబడ్డ కామాంధులు తాము పోలీసులమని చెప్పి బాలికను భయపెడ్డి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Delhi Gang Rape Shocker: దేశంలో మళ్లీ అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా కనిపించే అమ్మాయిలపై అఘాయిత్యాలు భయపెడుతున్నాయి. సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దారుణ సంఘటనే ఇందుకు నిదర్శనం. కల్కాజి మందిర సమీపంలోని పార్కులో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. పార్కులోకి చొరబడ్డ కామాంధులు తాము పోలీసులమని చెప్పి బాలికను భయపెడ్డి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగుల్ని పట్టుకునే క్రమంలో పోలీసులపైనే కాల్పులు జరిపి పరార్ అయ్యేందుకు ప్రయత్నించారు. ముగ్గురు దుండగుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓక్లా మండికి చెందిన ఆసిఫ్‌గా గుర్తించారు. ఇప్పుడు ఈఘటన ఢిల్లీలో కలకలం రేపుతోంది.
కలియుగం కాదు ఇది కలికాలం. సమాజంలో ఆడపిల్లల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలు, వేలాది మంది తిరిగే ప్రాంతాల్లోనే అమ్మాయిలపై అఘాయిత్యాలు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. నిన్న అంటే సెప్టెంబర్ 21న సోమవారం రాత్రి 7:30కు ఢిల్లీలోని ఓ పార్కులో 17 ఏళ్ల అమ్మాయిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కల్కాజి మందిరం సమీపంలోని పబ్లిక్ పార్కులో పోలీసులమని చెప్పి ముగ్గురు యువకులు చొరబడ్డారు. అంతకు ముందే అంటే రాత్రి 7 గంటల సమయంలో కల్కాజీ దేవాలయంలో పూజలు చేసుకునేందుకు 17 ఏళ్ల యువకుడితో కలిసి మైనర్ బాలిక అక్కడికి చేరుకుంది. పూజ ముగించుకున్న తర్వాత ఇద్దరూ కలిసి పార్కులోకి వెళ్లారు.
VIDEO | Delhi: Forensic team collects evidence from the encounter site after one of the accused in the alleged gang-rape near Kalkaji Temple was apprehended following a brief exchange of fire with the police.#DelhiPolice #Kalkaji
(Full video available on PTI Videos -… pic.twitter.com/x5o01qaqaV— Press Trust of India (@PTI_News) September 22, 2026
మైనర్ బాలిక ఆమె స్నేహితుడు ఇద్దరూ పార్కులో ఉన్న సమయంలో ముగ్గురు యువకులు పోలీసుల పేరుతో పార్కులోకి చొరబడ్డారు. అక్కడున్న మైనర్ బాలికతో పాటు ఆమె ఫ్రెండ్‌ని కత్తి చూపించి భయపెట్టారు. అటుపై ముగ్గురు యువకులు అమ్మాయిపై ఒకరి తర్వాత మరొకరు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ దారుణం జరిగిన నిమిషాల వ్యవధిలోనే అంటే 8 గంటల 45 నిమిషాలకు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పాట్‌కి చేరుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు దుండగుడు కాల్పులు జరిపాడు. దుండగుడిపై ఫైరింగ్ చేసిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కిన కామాంధుడు ఓక్లా మండికి చెందిన ఆసిఫ్‌గా గుర్తించారు. మిగిలిన ఇద్దరు ఎవరూ..? ఎటు పారిపోయారు..? అని గాలిస్తున్నారు. మరోవైపు బాధిత మైనర్ బాలికకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిన్న మధ్యాహ్నం నుంచి పార్కు పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన వాహనాల వివరాలు, సీసీ ఫుటేజ్ సేకరిస్తున్నారు. తదుపరి విచారణ కోసం స్థానికుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు పరిసరాల్లో అణువణువు జల్లెడ పడుతున్నారు.














