CSK vs SRH: చెన్నై భారీ స్కోర్.. 3 వికెట్లతో రాణించిన కమిన్స్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

చెన్నై చెపాక్‌లో సీఎస్కే 20 ఓవర్లలో 7 వికెట్లకు 180, డేవాల్డ్ బ్రేవిస్ 44, కార్తిక్ శర్మ 32, సంజూ శాంసన్ 27, హైదరాబాద్‌కు పాట్ కమిన్స్ 3 వికెట్లు, సాకిబ్ హుసేన్ 2

News18
News18

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో సీఎస్కే భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు సాధించింది. డేవాల్డ్ బ్రేవిస్ 44 (2 ఫోర్లు, 4 సిక్సులు), కార్తిక్ శర్మ 32 (3 ఫోర్లు, 2 సిక్సులు) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. చెన్నై ఆరంభంలో వేగంగా పరుగులు సాధించింది. సంజూ శాంసన్ 27 (5 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నంతసేపు స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. కానీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. ఇక కెప్టెన్ రుతురాజ్ (15), ఉర్విల్ పటేల్ (13), శివమ్ దూబే (26).. ఇలా కీలక బ్యాటర్లంతా తక్కువ పరుగులకే ఔటయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటగా.. సాకిబ్ హుసేన్ 2, మలింగ, ప్రఫుల్ హింగే చోరో వికెట్ తీసుకున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *