CV Anand: తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్.. ఆయన కెరీర్ వివరాలు ఇవే | తెలంగాణ వార్తలు | ACTPnews

CV Anand: తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్.. ఆయన కెరీర్ వివరాలు ఇవే | తెలంగాణ వార్తలు


కెరీర్ ప్రారంభం, కీలక బాధ్యతలు

సీవీ ఆనంద్ తన పోలీస్ ప్రస్థానాన్ని వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP)గా ప్రారంభించారు. కెరీర్ తొలి తొమ్మిదేళ్ల పాటు వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో పనిచేశారు. క్షేత్రస్థాయిలో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లలో స్వయంగా పాల్గొని పలు ఎన్‌కౌంటర్లలో సాహసాన్ని ప్రదర్శించారు.

నగర పోలీస్ కమిషనర్‌గా

హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి మెట్రో పాలిటన్ పోలీసింగ్‌లో తనదైన ముద్ర వేశారు. అలాగే విజయవాడ కమిషనర్‌గా కూడా సేవలందించారు.

ఇతర కీలక పదవులు

యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) డైరెక్టర్ జనరల్‌గా, ఎక్సైజ్ డైరెక్టర్‌గా, సివిల్ సప్లైస్ కమిషనర్‌గా పనిచేశారు. సివిల్ సప్లైస్ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఐటీ సంస్కరణల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 2000 కోట్ల ఆదాయాన్ని ఆదా చేయడంలో కీలక పాత్ర పోషించారు.

విప్లవాత్మక మార్పులు – ఘనతలు

పోలీస్ వ్యవస్థలో సాంకేతికతను జోడించి అనేక సంస్కరణలు తీసుకురావడంలో సీవీ ఆనంద్ సిద్ధహస్తులు.

లేక్ పోలీస్: 2002లో హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఆత్మహత్యలను నివారించేందుకు ‘లేక్ పోలీస్’ను ఏర్పాటు చేశారు, దీని ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడారు.

డ్రంక్ అండ్ డ్రైవ్: హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరియు అందుకు సంబంధించిన నిబంధనలను (SOPs) మొదటిసారిగా ఆయనే ప్రవేశపెట్టారు.

నార్కోటిక్స్ కట్టడి: హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్నప్పుడు డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడానికి ‘హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్’ (H-NEW)ను ప్రారంభించారు.

మహిళా భద్రత: తొలిసారిగా మహిళా ఇన్‌స్పెక్టర్లను స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా (SHOs) నియమించి చరిత్ర సృష్టించారు.

అందుకున్న పురస్కారాలు

ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను అనేక జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి.

ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (2002): నక్సలైట్లకు వ్యతిరేకంగా జరిపిన సాహసోపేతమైన ఆపరేషన్లకు ఈ పురస్కారం లభించింది.

ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ (2017): అత్యుత్తమ సేవలకు గాను ఈ గౌరవం దక్కింది.

వరల్డ్ పోలీస్ సమ్మిట్ అవార్డు (2025): మాదకద్రవ్యాల నిరోధక చర్యల్లో (H-NEW) ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు.

క్రీడారంగంలో..

సీవీ ఆనంద్ కేవలం పోలీస్ అధికారిగానే కాకుండా అద్భుతమైన క్రీడాకారుడిగా కూడా గుర్తింపు పొందారు. ఐపీఎస్ అధికారి కాకముందు అండర్-19 భారత క్రికెట్ జట్టు తరపున ఇంగ్లాండ్‌లో పర్యటించారు. పోలీస్ అకాడమీ శిక్షణ కాలంలో ఉత్తమ అథ్లెట్‌గా నిలిచారు. సాంకేతికతపై పట్టున్న అధికారిగా, కఠినమైన నిర్ణయాలు తీసుకునే శక్తి గల లీడర్‌గా సీవీ ఆనంద్ నేతృత్వంలో తెలంగాణ పోలీస్ విభాగం మరిన్ని విజయాలు సాధిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed