Last Updated:
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పిరిట్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక విషయాలు బయటకొచ్చాయి.
రెబెల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పిరిట్’. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రంలో ప్రభాస్ తన కెరీర్‌లోనే మొదటిసారి ఒక పవర్‌ఫుల్, ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో, ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జెట్ స్పీడ్‌తో సాగుతోంది. ఇటీవలే నగరంలోని ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్ అయిన ‘విమల్ థియేటర్’ లో ప్రభాస్ పాల్గొనగా కొన్ని కీలకమైన హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్ర యూనిట్ విజయవంతంగా చిత్రీకరించింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నాటికి సినిమా పూర్తి షూటింగ్ పార్ట్‌ను ముగించాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పక్కా ప్రణాళికతో ఉన్నారు. వంగ మార్క్ మేకింగ్‌కు తగ్గట్టుగా శరవేగంగా జరుగుతున్న షెడ్యూల్స్ చూస్తుంటే ఆయన అనుకున్న సమయానికే షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
టి.సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే సీనియర్ నటి నదియా, కాంచన, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
చిత్రబృందం ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌ను 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న రాబోయే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ ఇవ్వడానికి సందీప్ వంగ ప్లాన్ చేస్తున్నారట. ఆ రోజే ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పవర్‌ఫుల్ గ్లిమ్స్ లేదా టీజర్‌ను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈసారి రెబెల్ స్టార్ బర్త్డే రోజున థియేట్రికల్ బ్లాస్ట్ పక్కా అని ఫ్యాన్స్ ఇప్పుడే సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jun 03, 2026 11:17 AM IST













