Danny First Strike: రా అండ్ రస్టిక్‌ ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్.. బాబోయ్, ఇంత బోల్డ్‌గా ఉందేంట్రా అయ్యా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న కొత్త సినిమా ‘డానీ’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ స్ట్రైక్ వదిలి యూత్ లో వైబ్రేషన్స్ తెప్పించారు.

News18
News18

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్‌ల మీద రిజ్వాన్ నిర్మాణంలో కళ్యాణ్‌జీ గోగణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డానీ’. ఈ సినిమాలో ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా రానున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ ను తాజాగా విడుదల చేశారు.

‘నువ్వు బీచ్‌కి ఎప్పుడూ ఒంటరిగా వస్తావా?’.. అని అమ్మాయి అడగడం.. ‘నేను బీచ్‌కి రావాలంటే కచ్చితంగా అమ్మాయి ఉండాల్సిందే’ అని హీరో చెప్పే డైలాగ్.. ఆ తర్వాత వచ్చే బోల్డ్ డైలాగ్, బీచ్‌లో అమ్మాయి అందాలు ఇలా అన్నీ కూడా యూత్ ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ టీజర్‌ని గమనిస్తే కావాల్సినంత యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా ఉందని అర్థం అవుతోంది. బోల్డ్, రా అండ్ రస్టిక్‌గా ‘డానీ’ రానుందని ఈ ఫస్ట్ స్ట్రైక్ చెప్పకనే చెబుతోంది.

కళ్యాణ్‌జీ గోగన–ఆశిష్ గాంధీ కాంబినేషన్‌లో వచ్చిన ‘నాటకం’, ‘కళింగ’ చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ కాంబో మరోసారి ‘డానీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమాపై ఆసక్తి, క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది.

డానీ ఫస్ట్ స్ట్రైక్ లోని విజువల్స్, కెమెరా వర్క్ టాప్ నాచ్‌లో ఉంది. సాయి కార్తీక్ బీజీఎం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీకి ఖుషి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏకే ఆనంద్ కెమెరామెన్‌గా, మణికాంత్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర అప్డేట్లను మేకర్స్ ప్రకటించనున్నారు. ఇక అక్టోబర్ లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed