Last Updated:
ఫిన్ ఆలెన్ 47 బంతుల్లో సెంచరీతో కేకేఆర్, ఢిల్లీ నిర్దేశించిన 143 లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో సులభంగా ఛేదించింది, ఢిల్లీ 142కి పరిమితం.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ భారీ విజయం సొంతం చేసుకుంది. ఫిన్ ఆలెన్ అద్భుత సెంచరీ సాధించడంతో ఢిల్లీ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. ఆలెన్ కేవలం 47 బంతుల్లో 100* పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 10 భారీ సిక్సులు ఉండటం విశేషం. కెప్టెన్ రహానే 13 పరుగుల వద్ద రన్నౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రఘువంశీ (1) కూడా నిరాశపరిచినా.. కెమెరాన్ గ్రీన్‌తో (33*) కలిసి ఆలెన్ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఫిన్ ఆలెన్ దెబ్బకు ఢిల్లీ బౌలర్లు విలవిలలాడిపోయారు. ఢిల్లీ తరుపున అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే సాధించారు. ఓపెనర్ నిస్సంక 50 (5 ఫోర్లు, 3 సిక్సులు), కేఎల్ రాహుల్ 23 (4 ఫోర్లు) మంచి ఆరంభాన్ని అందించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా (8), సమీర్ రిజ్వి (3), ట్రిస్టన్ స్టబ్స్ (2), అక్షర్ పటేల్ (11).. ఇలా కీలక ప్లేయర్లంతా చేతులెత్తేశారు. చివర్లో అశుతోష్ 39 (3 ఫోర్లు, 3 సిక్సులు) వేగంగా పరుగులు చేయడంతో ఢిల్లీ 142 స్కోర్ చేయగలిగింది. ఇక కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. నరైన్, వైభవ్ అరోరా, గ్రీన్ చెరో వికెట్ తీసుకున్నారు.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
May 08, 2026 10:42 PM IST













