Delhi building collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ముగ్గురు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు! | | ACTPnews

News18


Last Updated:

ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఐదంతస్తుల నివాస భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, శిథిలాల కింద చిక్కుకున్న ఎనిమిది మందిని సహాయక బృందాలు రక్షించి ఆస్పత్రికి తరలించాయి.

News18
News18

దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతం న్యూ సీమాపురి ఈద్గా సమీపంలో బుధవారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. సుమారు 25 గజాల విస్తీర్ణంలో 25 ఏళ్ల క్రితం నిర్మించిన పాత ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలింది. ఈ తీవ్ర ప్రభావానికి పక్కనే ఉన్న రెండు నివాసాల గోడలతో పాటు సమీప మసీదు ప్రహరీ గోడ కూడా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు చిన్నారులు, 21 ఏళ్ల గర్భిణి సహా ముగ్గురు మరణించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది.

తీవ్రంగా గాయపడిన మరో ఎనిమిది మందిని సహాయక సిబ్బంది బయటకు తీసి తాహిర్‌పూర్‌లోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో మూడేళ్ల చిన్నారితో పాటు పలువురు పెద్దలు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

ఢిల్లీ అగ్నిమాపక శాఖ, స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి శిథిలాలను తొలగిస్తున్నాయి. శిథిలాల కింద ఇంకా ఇద్దరు ముగ్గురు చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. క్షతగాత్రులను తరలించే అంబులెన్సులకు ఆటంకం కలగకుండా సీమాపురి గోల్ చక్కర్, డీఎల్‌ఎఫ్ భోపురా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఘటనా స్థలం వద్ద జనం గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి సంభవించిన భూ ప్రకంపనల ధాటికి ఈ భవనానికి పగుళ్లు వచ్చాయి. ప్రమాదాన్ని పసిగట్టిన యజమాని ఇల్లు ఖాళీ చేయించే పనిలో ఉండగానే ఈ ప్రమాదం ముంచుకొచ్చింది. భవనం కింద చెత్త సేకరించే కూలీలు ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటున్న సమయంలో ఈ పెను విపత్తు జరిగి వారిపై భవన శిథిలాలు పడ్డాయి.

నెల రోజుల క్రితం ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో భవనం కూలి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే మరో విషాదం జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. పాత భవనాల భద్రతపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports