Last Updated:
ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా విడుదలై.. ఆ తర్వాత మౌత్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాగా ‘హనుమాన్ అంశ్’ నిలిచింది. విడుదలైన మొదటి వారం, పది రోజుల వరకు ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.
ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా విడుదలై.. ఆ తర్వాత మౌత్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాగా ‘హనుమాన్ అంశ్’ నిలిచింది. విడుదలైన మొదటి వారం, పది రోజుల వరకు ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే సినిమాను చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండో వారం నుంచి వసూళ్లు ఒక్కసారిగా పుంజుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా జోరు మొదలైంది.
మూడో, నాలుగో వారాల్లో అయితే ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్ల తాండవం చూపించింది. మొదటి వారంలో కనీసం రూ.10 లక్షలు కూడా వసూలు చేయలేకపోయిన ఈ సినిమా.. ఆ తర్వాత ఊహించని స్థాయిలో పుంజుకుంది. ఇప్పటి వరకు ఏకంగా రూ.425 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. చిన్న స్థాయిలో మొదలైన ఈ సినిమా ప్రయాణం ఇంత భారీ విజయంగా మారడం ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇక ఈ సంచలన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ సిద్ధమైంది. అక్టోబర్ 9న ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ట్రైలర్‌లో కనిపించిన కథ, విజువల్స్, యాక్షన్ అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు విషాల్ చతుర్వేది, మేన్ లీడ్‌గా నటించిన శోభినవ్ సత్యతో పాటు మూత్రీ మూవీ శంకర్, సీడెడ్ మరియు ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సినిమా విశేషాలతో పాటు తెలుగు రిలీజ్‌కు సంబంధించిన పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు.
ఇప్పటికే నార్త్‌లో భారీ వసూళ్లతో సంచలనం సృష్టించిన ‘హనుమాన్ అంశ్’.. తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మౌత్ టాక్‌తోనే వందల కోట్ల వసూళ్లను సాధించిన సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అక్టోబర్ 9న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.














