Last Updated:
కేజీఎఫ్ సిరీస్‌తో పేరుగాంచిన రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘టాక్సిక్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించిన రాకింగ్ స్టార్ యశ్ నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నేడు రిలీజైన ఈ యాక్షన్ డ్రామా విశాఖపట్నంలోని థియేటర్లలో సందడి చేస్తోంది. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో వైజాగ్‌లోని సినీ అభిమానులు ఉదయం ఆటలకే థియేటర్లకు బారులు తీరారు. భారీ కటౌట్లు, బ్యానర్లు కట్టి పండుగ వాతావరణం సృష్టించారు. అయితే మొదటి రోజు మార్నింగ్ షోలు పూర్తయ్యే సరికి పబ్లిక్ నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది.













