Last Updated:
గ్రాండ్ డ్రీమ్స్ ప్రొడక్షన్, ఫస్ట్ లుక్ ఫిల్మ్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై ప్రశాంతి గుమ్మి నిర్మాణ సారథ్యంలో రూపొందిన చిత్రం దోబుచులాటేలరా. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా.
గ్రాండ్ డ్రీమ్స్ ప్రొడక్షన్, ఫస్ట్ లుక్ ఫిల్మ్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై ప్రశాంతి గుమ్మి నిర్మాణ సారథ్యంలో రూపొందిన చిత్రం దోబుచులాటేలరా. దర్శకుడు రామ్ కిరణ్ రెడ్డి.బి తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య భరత్ చంద్ర, చాంధిని రావు, వైవా రాఘవ, శ్రీ అన్వేష్, రాజశేఖర్ అనిగి, రాఖీ, హర్షితా, శ్రీవల్లి విజయ, రాహుల్ నడింపల్లి, టీఎన్ఆర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈశ్వర్ దత్తు సంగీతం అందించారు. ఈ నెల 25 నుంచి ఆహా ఓటీటీ ఫ్లాట్ పామ్ లో ఈ సినిమా అఫీసియల్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథ, కథనాలేంటో చూద్దామా..
ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ చిత్ర(చాంధిని రావు) తను పనిచేస్తున్న ఫోటోగ్రఫీ ఆఫీసులో బాసుతో గొడవపడి జాబ్ మానేస్తుంది. అదేవిధంగా సిటీలో ఫోటోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో సొంత ఊరిని వదిలి సిటీకి వచ్చిన అర్జున్(సూర్య భరత్ చంద్ర) తన ఫ్రెండ్ బాబు స్టూడియో చూసి నిరాశ పడుతాడు. ఇలా అనుకోకుండా చిత్ర, అర్జున్ ల లక్ష్యం ఒకే అవడంతో ఒక సందర్భంలో కలుస్తారు. అయితే ఓ రోజు షూట్ ఉందని చెప్పి.. చిత్ర దగ్గర కెమెరా తీసుకెళ్లిన అర్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో కంగారు పడ్డ చిత్ర పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అసలు అర్జున్ ఎక్కడి వెళ్ళాడు? చిత్రను మోసం చేశాడా? మళ్ళీ ఇద్దరు ఎలా కలిశారు? కెమెరా కోసం హీరో, హీరోయిన్ చేసే రిస్క్ ఏంటి? అర్జున్ ను పోలీస్ ఎందుకు అరెస్ట్ చేస్తారు? కిడ్నాప్ కేసులో, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మాస్క్ లు పెట్టుకున్న వ్యక్తులు ఎవరు? వరంగల్ పెద్దిరెడ్డికి హీరోకు ఏంటీ సంబంధం? ఇవన్నీ తెలియాలంటే దోబుచులాటేలరా సినిమా చూస్తే తెలుస్తుంది.
హీరో, హీరోయిన్ ఇద్దరిపై డిజైన్ చేసిన సీన్స్, వాటిని దర్శకుడు మలచిన తీరు మెప్పిస్తుంది. ఇద్దరి మధ్య పరిచయం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. వారి పరిచయం అయిన తర్వాత వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కెమెరా తీసుకొని అర్జున్ మిస్ అయినా తరువాత ఆ టెన్షన్ కూడా బాగా బిల్డ్ చేశారు. దోబుచులాటేలరా అనేది సినిమాకు తగిన టైటిల్ అనిపిస్తుంది.
ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా కథలో లీనం చేస్తూ గ్రిప్ తీసుకొచ్చారు. ఈ భాగంలో వచ్చే పెంచాలదాసు సాంగ్ చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో హీరోయిన్ బాస్ గా యాక్ట్ చేసిన వైవా రాఘవ పాత్ర ఎంట్రీతో వచ్చే ట్విస్ట్ అదిరింది. ఇక అక్కడ నుంచి కెమెరాను వెతికే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి. అలాగే హీరోయిన్ కు ఫోటోగ్రఫీ అంటే ఎందుకు అంతా పిచ్చో అని చెప్పే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. లాస్ట్ లో ఇచ్చిన ట్విస్ట్ మెసేజ్ కూడా బాగుంది. సినిమా చూస్తున్నంత సేపు అలా సాగిపోతుంది. ఈ సినిమా ప్రధాన బలం కామెడీ.
హీరో సూర్య భరత్ చంద్ర కొత్త వాడైనా తన పాత్రలో ఒదిగిపోయి యాక్టింగ్ చేశారు. కామెడీ సీన్లతో పాటు ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండించాడు, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇక ముందు కూడా మంచి క్యారెక్టర్ పడితే అద్భుతంగా చేయగలడు అనిపించింది. హీరోయిన్ చాంధిని రావు కూడా ఆకట్టుకుంది. చాలా స్కోప్ ఉన్న పాత్రలో తన హావభావాలతో ఆకట్టుకుంది. ఎమోషన్స్ కూడా బాగా పండించింది. పోలీస్ గా టీఎన్ఆర్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. పెద్దిరెడ్డిగా రాజశేఖర్ అనిగి తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలో ఒదిగిపోయిన శ్రీ అన్వేష్, బాబు పాత్రలో కామెడి పండించాడు. మిగితా నటీనటులు కూడా తమ పాత్రలకు తగ్గట్టు చేశారు.
రచన – దర్శకుడిగా మాత్రమే కాకుండా సినిమాటోగ్రఫీ, ఎడిటర్ గా రామ్ కిరణ్ రెడ్డి ఛాలెంజింగ్ పాత్ర పోషించాడు. సినిమా మీద ఎంతో పట్టు ఉంటే గాని ఇలా చేయడానికి సాధ్యపడదు. డైలాగ్స్ కూడా అద్భుతమైన పంచ్ లైన్స్ తో నింపేశారు. ప్రతీ ఫ్రేమ్ లో రామ్ కిరణ్ రెడ్డి ప్రతిభ కనిపించింది. ప్రేక్షకులకు మెప్పించడంలో డైరెక్టర్ విజయం సాధించాడు. అలాగే కెమెరాకు సంబంధించి కొన్ని విషయాలను డిటైలింగ్ గా చెప్పడం మెప్పించింది. ఈ చిత్రానికి సంగీతం కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. పతాక సన్నివేశాల్లో బీజీఎమ్ చాలా బాగా వచ్చింది. ఇక నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. నిర్మాత ప్రశాంతి గుమ్మి, ఓబుల్ రెడ్డి సినిమా టెస్ట్ ఉన్న నిర్మాతలు అనిపించుకున్నారు.
ప్లస్ పాయింట్స్ :
కథలో ట్విస్ట్ లు
కథనం
కామెడీ
మైనస్ పాయింట్స్ :
కొన్ని ల్యాగింగ్ సీన్స్
అక్కడక్కడా రొటీన్ సన్నివేశాలు
రేటింగ్: 2.75














