Hyderabad: 10 సెకన్ల ముందు ప్రాణంతో.. తర్వాత నిర్జీవంగా.. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై తీవ్ర విషాదం.. వీడియో | | ACTPnews

PC: X.com


Last Updated:

Hyderabad: నగరంలో వినాయక నిమజ్జన వేడుకల పర్యవేక్షణ విధుల్లో విషాదం చోటుచేసుకుంది. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ గుర్తుతెలియని బైక్ ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం చెందారు.

PC: X.com
PC: X.com

ఈ ఘటన పోలీస్ శాఖతో పాటు ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా సేవలందిస్తున్న వెంకన్న, హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల కోసం నగరానికి వచ్చారు. ట్యాంక్‌బండ్ వద్ద భక్తుల రద్దీ, ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి సమయంలో విధి నిర్వహణలో భాగంగా ఆయన రోడ్డు దాటుతుండగా, తీవ్ర వేగంతో దూసుకొచ్చిన గుర్తుతెలియని బైక్ ఆయన్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారుడు బైక్‌ను ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడివున్న ఎస్సై వెంకన్నను తోటి సిబ్బంది, స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో వైద్యులు ఆయనకు చికిత్స అందించినప్పటికీ, తలకు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు.

నిమజ్జన బందోబస్తులో అంకితభావంతో పనిచేస్తూ అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఎస్సై మృతిపై పోలీస్ ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ఢీకొట్టి పరారైన బైక్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed