Gautam Gambhir: రోహిత్ శర్మపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘తనతో ఉన్న బంధం వేరు’! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో తనకున్న ప్రత్యేక బంధాన్ని పంచుకున్నాడు. తమ మధ్య బంధం కోచ్, కెప్టెన్‌కు పరిమితం కాలేదని, పాత రోజుల నుంచే ఒకరికొకరు బాగా తెలుసని స్పష్టం చేశాడు.

News18
News18

టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. జియో స్టార్‌తో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గంభీర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. జట్టును విజయపథంలో నడిపించాలంటే కోచ్, కెప్టెన్ మధ్య బలమైన అనుబంధం ఉండటం చాలా అవసరమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మతో తనది కేవలం కోచ్, కెప్టెన్ సంబంధం మాత్రమే కాదని, అతను జాతీయ జట్టులోకి వచ్చిన కొత్తలో తాను సీనియర్ ఆటగాడిగా ఉన్నప్పటి నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని తెలిపాడు.

విదేశాల నుంచి వచ్చిన కొత్త కోచ్‌కి ఇక్కడి ఆటగాళ్ల గురించి తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందని, కానీ రోహిత్ ఆటతీరు, అతని వ్యక్తిత్వం తనకు మొదటి నుంచే తెలుసని గంభీర్ స్పష్టం చేశాడు. ఇలాంటి సుదీర్ఘ పరిచయం వల్ల ఇద్దరూ కలిసి జట్టు కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడం ఎంతో సులువుగా మారిందని వివరించాడు.

ఎంతోకాలంగా కలిసి ఆడిన అనుభవం ఉండటంతో ఇద్దరి ఆలోచనా విధానాలు చాలావరకు కలుస్తాయని గంభీర్ చెప్పుకొచ్చాడు. కొన్నిసార్లు తన ఆలోచనలు ఒకలా, కెప్టెన్ ఆలోచనలు మరోలా ఉండొచ్చని, కానీ అంతిమంగా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని అన్నాడు. జట్టుకు ఏది మంచిదో అదే తుది నిర్ణయంగా తీసుకుంటామని, దీనికి మించిన సరైన విధానం మరొకటి ఉండదని స్పష్టం చేశాడు. ఆటగాడిగా ఎదిగే క్రమంలో రోహిత్ పడిన కష్టం, సాధించిన విజయాలు అన్నీ తనకు తెలుసని, ఓ యువ ఆటగాడి స్థాయి నుంచి ప్రపంచ క్రికెట్‌ను శాసించే గొప్ప నాయకుడిగా రోహిత్ ఎదిగిన తీరు అద్భుతమని కొనియాడాడు. ఇద్దరి మధ్య ఉన్న ఈ పరస్పర అవగాహన వల్లే మైదానంలో వ్యూహాలు అమలు చేయడం చాలా సులభం అవుతుందని అభిప్రాయపడ్డాడు.

ఇప్పటివరకు తాను నలుగురు వేర్వేరు కెప్టెన్లతో కలిసి పనిచేశానని, వారందరితో తన ప్రయాణం అద్భుతంగా సాగిందని గంభీర్ వెల్లడించాడు. ఆ నలుగురు కెప్టెన్ల ప్రధాన లక్ష్యం భారత క్రికెట్ జట్టును ఉన్నత స్థానంలో నిలపడమేనని ప్రశంసించాడు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశానికి విజయాలు అందించడానికే వాళ్లు ఎప్పుడూ తొలి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశాడు. ఆటగాడిగా ఎన్నో విజయాలు సాధించిన గంభీర్, ఇప్పుడు కోచ్‌గా కూడా అదే విజయపరంపర కొనసాగించే దిశగా వ్యూహాలు రచిస్తున్నాడు. ముఖ్యంగా జట్టులోని సీనియర్లతో, యువ ఆటగాళ్లతో అతనికి ఉన్న చనువు భవిష్యత్తులో టీమిండియాకు ఎంతో లాభిస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed