Dooradarshini Movie: ‘దూరదర్శిని’ మూవీ రివ్యూ.. విలేజ్ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతీ చిన్న సినిమా కూడా పెద్ద సినిమాల రేంజ్‌లోనే హిట్లు కొడుతున్నాయి. అలా ఈ వారం కంటెంట్‌ను నమ్ముకుని బరిలోకి దిగిన సినిమా దూరదర్శని.

News18
News18

ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతీ చిన్న సినిమా కూడా పెద్ద సినిమాల రేంజ్‌లోనే హిట్లు కొడుతున్నాయి. అలా ఈ వారం కంటెంట్‌ను నమ్ముకుని బరిలోకి దిగిన సినిమా దూరదర్శని. టైటిల్ నుంచి ప్రేక్షకుల్లో వింటేజ్ వైబ్స్ తీసుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం…

కథ:

ఈ సినిమా కథ మట్టపర్రు అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. కులాల పేరుతో కొట్టుకునే ఆ ఊరిలో హరీ అలియాస్ సువిక్షీత్, వాణి అలియాస్ గీతికా రతన్‌లు ఒకరికి ఒకరంటే ప్రాణం. వాణి అన్న పరుశురాం ఊరిలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. పేదవాడైన హరి.. పెద్ద ఇంటి అమ్మాయి వాణిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. వాణికి కూడా హరి అంటే ఇష్టం. వీరిద్దరు శుక్రవారం దూరదర్శినిలో వచ్చే చిత్ర లహరిని చూడడానికి వెళ్తూ ప్రేమించుకుంటుంటారు. అంతా సాఫీగా జరుగుతుందనుకున్న టైమ్‌లో వాణి అన్న పరుశురాంకు, హరీకి మధ్య గొడవ అవుతుంది. దాంతో వీళ్ల ప్రేమకు పరుశురాం అడ్డుచెప్తాడు. చివరికి హరి, వాణిలు వాళ్ల ప్రేమను గెలిపించుకోవడానికి ఏం చేశారు అనేది తెలియాలంటే థియేటర్‌లో ఈ సినిమా చూడాల్సిందే…

కథా విశ్లేషణ:

ప్రతీ శుక్రవారం రాత్రి దూరదర్శినిలో వచ్చే చిత్ర లహరి అప్పటి కుర్రాళ్లకు ఒక ఎమోషన్. అంతేందుకు అప్పట్లో చాలా ప్రేమ కథలు కూడా చిత్ర లహరి వల్ల పుట్టాయి. అలాంటి ఎమోషన్‌ను తీసుకుని దాని చుట్టూ కథ అల్లుకున్నాడు దర్శకుడు కార్తికేయ కొమ్మి. మట్టప్పరు అనే గ్రామంలో దూరదర్శిని ఇద్దరిని ఎలా కలిపింది అనేది చాలా బాగా చూపించాడు. కేవలం హీరో హీరోయిన్‌ల లవ్ స్టోరీ మాత్రమే కాదు కులాల వల్ల మనుషులు జీవితం ఎంత దారుణంగా అయిపోతుందో చూపించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయం.. హరి, వాణిల ప్రేమను చూపించారు. అయితే కొన్ని చోట్ల కాస్త సాగదీతలా అనిపిస్తుంది. మళ్లీ ఇంటర్వెల్‌కు మంచి పికప్ అందుకుంటుంది. సెకండాఫ్‌లో ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. కొన్ని చోట్ల కామెడీ కూడా పర్వాలేదనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాములుగా ఉండదు.

నటీనటుల పర్‌ఫార్మెన్స్:

ఈ సినిమాతో హీరో, హీరోయిన్‌లుగా పరిచయమైన సువీక్షిత్, వాణీలు మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. డెబ్యూ సినిమానే అయినా.. అనుభవమున్న నటులుగా యాక్టింగ్ చేశారు. హీరో ఫ్రెండ్స్‌గా నటించిన భద్ర, బలరామ్‌లతో పాటు హీరో గ్యాంగ్ మంచి కామెడీ పండించింది. హీరో అన్నగా నటించిన పరుశురాం కూడా మంచి గంభీరమైన పర్ఫార్మెన్స్‌తో బాగా నటించాడు.

టెక్నికల్:

సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. సింపుల్ సీన్లను కూడా ఆనంద్ గుర్రన తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. పాటలు పెద్దగా ఎక్కలేదు కానీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పుంటే బాగుండేది అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌లు+

స్టోరీ,

పల్లెటూరి బ్యాక్‌డ్రాప్,

హీరో, హీరోయిన్‌ల నటన,

మైనస్‌లు-

స్లోగా నడిచే కథనం,

పాటలు.

ఫైనల్‌గా.. 90స్ కిడ్స్‌కు కనెక్ట్ అయ్యే కథ.

రేటింగ్: 3

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports