Drushyam 3 Movie: ‘దృశ్యం-3’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తెలుగు వాళ్లకు మలయాళం సినిమాలను పరిచయం చేసింది దృశ్యం సినిమానే. తెలుగులో వెంకీమామ తీసి హిట్టు కొట్టినా.. ఒరిజినల్ ఫ్లేవరే చాలా మందికి నచ్చింది. ఆ తర్వాత దృశ్యం-2ను కూడా అదే స్థాయిలో ఆదరించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు పట్టం కట్టారు.

News18
News18

తెలుగు వాళ్లకు మలయాళం సినిమాలను పరిచయం చేసింది దృశ్యం సినిమానే. తెలుగులో వెంకీమామ తీసి హిట్టు కొట్టినా.. ఒరిజినల్ ఫ్లేవరే చాలా మందికి నచ్చింది. ఆ తర్వాత దృశ్యం-2ను కూడా అదే స్థాయిలో ఆదరించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో 3వ పార్ట్ వచ్చేసింది. మరీ మోహన్ లాల్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం…

దృశ్యం పార్ట్ 2 కథ ఎక్కడైతే ముగిసిందో.. దృశ్యం 3 అక్కడ నుంచే స్టార్ట్ అయింది. వరుణ్ హత్య కేసును హై కోర్టు పూర్తిగా కొట్టేయడంతో జార్జ్ అలియాస్ మోహన్ లాల్ ఫ్యామిలీ పెద్ద గండం నుంచి గట్టెక్కినట్లు ఫీల్ అవుతారు. గతాన్ని మర్చిపోయి హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తుంటారు. అంతేకాకుండా సినిమాల మీద పిచ్చి ఉండే జార్జ్ తన సొంత కథనే ‘దృశ్యం’ పేరుతో సినిమా తీసి హిట్టు కొడతాడు. మరోవైపు తన పెద్ద కూతురు అంజు అలియాస్ అన్సీబా హసన్‌ను పెళ్లి చేయాలని మంచి సంబంధాలు చూస్తుంటాడు. అయితే ఏదో ఒక కారణంతో అంజుకు వచ్చిన సంబంధాలన్ని ఆఖరి నిమిషంలో ఆగిపోతుంటాయి. అప్పుడే జార్జ్‌కు అనుమానం స్టార్ట్ అవుతుంది. దీని వెనుకున్న కారణం ఏంటా అని ఆరాతీయడం మొదలు పెడతాడు. అప్పుడు జార్జ్‌కు కొందరు శత్రువులు పాత పగను మనసులో పెట్టుకుని తన కూతురుకు పెళ్లి కాకుండా అడ్డుపడుతున్నారని గ్రహిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అంజు పెళ్లికి అడ్డుగా ఉంది ఎవరు? దీని వెనుక వరుణ్ ఫ్యామిలీ హస్తం ఉందా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే…

ఇప్పటి వరకు వచ్చిన రెండు పార్టులు ఊహించని స్థాయిలో హిట్లు కొట్టాయి. అదే అంచనాలతో వచ్చిన దృశ్యం 3 మాత్రం థ్రిల్లర్ ప్రియులను కాస్త నిరాశ పరిచింది. మొదటి రెండు పార్టులకు సంబంధించిన కథను షార్ట్‌గా చెప్పడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మూడో భాగంలోకి డైరెక్టర్ తీసుకెళ్లాడు. జార్జ్ జీవితం, నిర్మాతగా హిట్టు కొట్టడం, పెద్ద కూతురికి మంచి సంబంధాన్ని సెట్ చేయడం మొత్తం ఫస్ట్ హాఫ్‌లో చూపించాడు. ఇంటర్వెల్ వరకు కూడా సినిమా కథ సింపుల్‌గానే వెళ్తుంది. కరెక్ట్‌గా ఇంటర్వెల్‌లో థ్రిల్లర్ లవర్స్‌కు కావాల్సిన ట్విస్ట్‌ను వదిలాడు.

సెకండ్ హాఫ్‌కు కావాల్సిన క్యూరియాసిటినీ బాగా బిల్డ్ చేశారు. సెకండ్ హాఫ్‌లో శత్రువులు వ్యూహాలు పన్నుతుంటే, జార్జ్ సింగిల్ హ్యాండ్‌తో ఎలా తిప్పికొట్టాడు అనే పాయింట్ ఉత్కంఠను కలిగిస్తుంది. అయితే కథనాన్ని మరింత గ్రిప్పింగ్‌గా నడిపించడంలో జీతూ జోసెఫ్ ఈ సారి కాస్త తడబడ్డాడు. అయితే.. లాస్ట్ 30 నిమిషాల క్లైమాక్స్ మాత్రం సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. వరుణ్ తండ్రి వేసే ఎత్తుగడలు, వాటిని జార్జ్ తన సినిమా నాలెడ్జ్ ఉపయోగించి రివర్స్ అటాక్ చేసే విధానం థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. ముగింపులో ఈ కథ ఇక్కడితో అయిపోలేదనే హింట్ ఇచ్చిన తీరు బాగుంది.

మోహన్‌లాల్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధపడే ఒక సామాన్య తండ్రి పాత్రలో మోహన్‌లాల్ మరోసారి జీవించేశారు. ఆయన కళ్లల్లో కనిపించే భయం, అదే సమయంలో కనిపించే తెలివితేటలు అద్భుతం. మీనా, అన్సీబా, ఎస్తర్ తమ పరిధి మేర చక్కగా నటించారు. విలనిజం పండించిన కళాభవన్ షాజన్ నటన మెప్పిస్తుంది. బిజూ మీనన్ గెస్ట్ రోల్ సర్ప్రైజ్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ కేరళ లొకేషన్లను నీట్‌గా చూపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

మోహన్‌లాల్ విశ్వరూపం

మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ట్విస్ట్‌లు

మైనస్ పాయింట్స్:

స్లోగా సాగే ప్రథమార్ధం

తెలుగు డబ్బింగ్ పేర్లు

‘దృశ్యం 3’ సినిమా మొదటి రెండు పార్ట్‌లకు ఉన్నంత స్ట్రాంగ్ కంటెంట్‌తో సాగకపోయినా… క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని మలుపులు, మోహన్‌లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం థ్రిల్లర్ లవర్స్ ఖచ్చితంగా ఒకసారి చూడోచ్చు..

రేటింగ్: 2.5

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *