FIFA World Cup 2026: మెస్సీ, రొనాల్డో కాదు.. డొనాల్డ్ ట్రంప్ దృష్టిలో ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేట్ ఇతడే! | క్రీడా వార్తలు | ACTPnews

ట్రంప్, రొనాల్డో, మెస్సీ


Last Updated:

ఇద్దరూ చరిత్ర సృష్టించేందుకు పోటీపడుతున్న తరుణంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, ఈ 2026 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ట్రంప్ హాజరై, విజేతగా నిలిచిన జట్టుకు స్వయంగా ట్రోఫీని అందించనున్నారు.

ట్రంప్, రొనాల్డో, మెస్సీ
ట్రంప్, రొనాల్డో, మెస్సీ

FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచంలో ‘అత్యుత్తమ ఆటగాడు’ (Greatest of All Time – GOAT) ఎవరనే చర్చ వచ్చినప్పుడల్లా లయనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోల పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం వీరిద్దరి కంటే మరో ప్లేయర్‌ను ఆల్ టైమ్ గ్రేట్‌గా తేల్చి చెప్పారు.

ప్రస్తుతం అమెరికా, మెక్సికో, కెనడా దేశాల వేదికగా 2026 ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతోంది. అర్జెంటీనాను వరుసగా రెండోసారి ప్రపంచ విజేతగా నిలపాలని మెస్సీ, తన సుదీర్ఘ కెరీర్‌లో ఒక్కసారైనా దక్కించుకోలేకపోయిన మెగా ట్రోఫీని పోర్చుగల్‌కు అందించాలని రొనాల్డో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇద్దరూ చరిత్ర సృష్టించేందుకు పోటీపడుతున్న తరుణంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, ఈ 2026 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ట్రంప్ హాజరై, విజేతగా నిలిచిన జట్టుకు స్వయంగా ట్రోఫీని అందించనున్నారు.

ఈ నేపథ్యంలో ‘డాజన్’ (DAZN) క్రీడా ఛానల్‌తో మాట్లాడిన ట్రంప్, మెస్సీ-రొనాల్డోలలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు భిన్నమైన సమాధానం ఇచ్చారు. తాను స్వయంగా మైదానంలో పెలే ఆటను చూశానని, అతనే అందరికంటే గొప్పవాడని అన్నారు.

ఆ రోజు మైదానంలో పెలే ఆట చూశా..

“చాలా ఏళ్ల క్రితం, నేను యువకుడిగా ఉన్నప్పుడు పెలే అనే ఆటగాడిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయన ‘కాస్మోస్’ అనే జట్టు తరపున ఆడారు. నా స్నేహితుడు, వార్నర్ కమ్యూనికేషన్స్ మాజీ సీఈఓ స్టీవ్ రాస్ ఈ ప్రణాళిక వెనుక ఉన్నారు” అని ట్రంప్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

“ఆ మ్యాచ్ జరిగిన మెట్‌లైఫ్ స్టేడియం (అప్పట్లో దీని మునుపటి వెర్షన్ స్టేడియం) జనం నడుమ కిక్కిరిసిపోయింది. సరిగ్గా ఇదే మెడోలాండ్స్ మైదానంలో పెలే ఆడారు. నా వయస్సు గురించి ఇప్పుడు నేను ఎక్కువగా చెప్పాలనుకోవడం లేదు కానీ, అది చాలా కాలం క్రితం జరిగిన ముచ్చట” అని ట్రంప్ నవ్వుతూ జోడించారు.

ఓల్డ్ ఈజ్ గోల్డ్!

బేస్ బాల్ చరిత్రలో ‘బేబ్ రూత్’ ఎంతటి గొప్ప ఆటగాడో, ఫుట్‌బాల్‌లో పెలే అంతటి మహానుభావుడని ట్రంప్ కొనియాడారు.

“నేను అప్పుడు చాలా చిన్నవాడిని. పెలే ఆటను చూడటానికి వచ్చాను. మైదానంలో ఆయన ప్రదర్శన అద్భుతం, అమోఘం. బహుశా నేను పాతకాలపు ఆలోచనలతో మాట్లాడుతున్నానని అనుకోవచ్చు. ఇది బేస్ బాల్‌లో ‘బేబ్ రూత్’ పేరు చెప్పినట్లే ఉంటుంది. కానీ, నా దృష్టిలో పెలే మాత్రమే అత్యంత గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడు” అని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports