Plane Crash: ఫ్రాన్స్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన స్కైడైవింగ్ విమానం.. పైలట్‌తో సహా 11 మంది మృతి! | | ACTPnews

విమాన ప్రమాదం


Last Updated:

స్థానిక ప్రిఫెక్చర్ (పరిపాలనా విభాగం), ‘బీఎఫ్ఎమ్’ (BFM) టీవీ కథనం ప్రకారం.. నాన్సీ నగరానికి సమీపంలోని ‘టాంబ్లైన్’ (Tomblaine) అనే పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.

విమాన ప్రమాదం
విమాన ప్రమాదం

Plane Crash: ఫ్రాన్స్‌లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈశాన్య ఫ్రాన్స్‌లోని మీర్తే-ఎట్-మోసెల్ (Meurthe-et-Moselle) విభాగంలో ఒక చిన్న పౌర విమానం (సివిలియన్ ప్లేన్) కుప్పకూలిన ఘటనలో పైలట్‌తో సహా కనీసం 11 మంది మరణించినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. స్థానిక ప్రిఫెక్చర్ (పరిపాలనా విభాగం), ‘బీఎఫ్ఎమ్’ (BFM) టీవీ కథనం ప్రకారం.. నాన్సీ నగరానికి సమీపంలోని ‘టాంబ్లైన్’ (Tomblaine) అనే పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. నాన్సీ-ఎషే (Nancy-Essey) ఎయిర్‌ఫీల్డ్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ చిన్న ప్రైవేట్ విమానం ఒక్కసారిగా కిందకు దూసుకువచ్చి కూలిపోయింది.

స్కైడైవింగ్‌కు వెళ్తుండగా విపత్తు

స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారు పారాచూట్ జంప్స్ (స్కైడైవింగ్ ఎక్స్‌కర్షన్) కోసం వెళ్తున్న రెండు పారాచూటిస్ట్ బృందాలుగా గుర్తించారు. విమానం కూలిపోయిన వెంటనే భారీగా మంటలు చెలరేగడంతో పాటు, అది పేలిపోయే అవకాశం ఉందనే అనుమానంతో అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ప్రమాదం జరిగిన టాంబ్లైన్‌లోని సాల్వడార్ అల్లెండే స్ట్రీట్ పరిసర ప్రాంతాలకు ప్రజలు ఎవరూ రావద్దని, అత్యవసర సహాయక బృందాల (ఎమర్జెన్సీ సర్వీసెస్) వాహనాల రాకపోకలకు వీలుగా దారి ఇవ్వాలని జాతీయ పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు.

రంగంలోకి అంతర్గత వ్యవహారాల మంత్రి

ప్రమాద తీవ్రత దృష్ట్యా, ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ (Laurent Nuñez) మరికొద్ది గంటల్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నట్లు ఆయన అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports