Last Updated:
Hyderabad: పది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన గణేష్ చవితి ఉత్సవాలు పూర్తిపోయాయి. శుక్రవారం నిమజ్జనాలతో ఈక్రతువు పూర్తైనట్లుగా తెలంగాణ పోలీస్ బాస్ వెల్లడించారు. ఈ పది రోజుల్లో పలుచోట్ల జరిగిన అపశృతి సంఘటనల్లో చనిపోయిన వారి సంఖ్యతో పాటు విగ్రహాల సంఖ్యను వెల్లడించారు.
Hyderabad: పది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన గణేష్ చవితి ఉత్సవాలు పూర్తిపోయాయి. శుక్రవారం నిమజ్జనాలతో ఈక్రతువు పూర్తైనట్లుగా తెలంగాణ పోలీస్ బాస్ వెల్లడించారు. ఈ పది రోజుల్లో పలుచోట్ల జరిగిన అపశృతి సంఘటనల్లో చనిపోయిన వారి సంఖ్యతో పాటు పోలీస్ బందోబస్తు డ్యూటీ చేస్తుండగా హిట్ అండ్ రన్ కేసులో చనిపోయిన ఎస్సైతో పాటు వివరాలను వెల్లడించారు డీజీపీ సీవీ ఆనంద్. ఇక జియో ట్యాగింగ్ అమర్చి, పర్మిషన్ తీసుకున్న విగ్రహాల్లో ఇంకా చాలా నిమజ్జనం పూర్తి కాలేదని.. రేపు అనగా శనివారంతో ఈ నిమజ్జన కార్యక్రమం ముగుస్తుందన్నారు. ఇక గతేడాది ప్రతిష్టించిన గణపతి విగ్రహాల కంటే ఈసారి హైదరాబాద్‌లోనే 8వేల విగ్రహాలు పెరిగినట్లుగా వెల్లడించారు.
తెలంగాణలో గణేష్ చవితి ఉత్సవాలు శుక్రవారం నిమజ్జన కార్యక్రమంతో ముగినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే ఈసారి పోలీసుల నిఘా, పటిష్టమైన భారీ బందోబస్తు కారణంగా అక్కడక్కడ జరిగిన కొన్ని దుర్ఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసినట్లుగా రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ముందుగా డిపార్ట్మెంట్కి చెందిన కొత్తగూడెం టూ టౌన్ ఎస్ఐ కె. వెంకన్నను ట్యాంక్ బండ్ పై స్కూటర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ ఎస్ఐ చనిపోయారు. ఈఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సైతం విచారం వ్యక్తం చేశారు. ఇక పఠాన్ చెరువులో 6 గురు యువకులు చనిపోవడం విషాదకరమని డీజీపీ తెలిపారు. ఈ ఏడుగురితో పాటు ఖైరతాబాద్ గణేష్ వద్ద ఒకరు, నిర్మల్ లిప్ట్ దగ్గర మరొకరు మృతి చెందారు. ఇక డీజే(Dj) సౌండ్స్ విపరీతంగా రావడంతో గుండె పోటుతో మరొకరు చనిపోయారు. వీటితో పాటు 26 మంది గాయాపడ్డరు. మల్కాజ్ గిరిలో 16 మంది గాయపడ్డారు.
ఇక హైదరాబాద్ నగరంలో 7గంటలు వరకు 31 ,765 విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లుగా పోలీసు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు విడతల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయని నిర్మల్ జిల్లా బైంసాలో హిందు ముస్లిం కలిసి అక్కడ కూడా చాలా ప్రశాంతంగా జరిగిందన్నారు. శనివారం ఉదయం వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ తెలిపారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 24 వేలు విగ్రహాలు ఏర్పాటు చేశారు. జియో ట్యాగింగ్, పోర్టల్ సమాచారం ఆధారంగా 1లక్ష 24 వేలు విగ్రహాలు ఏర్పాటు చేసినట్లుగా తమకు సమాచారం ఉందన్నారు. ఇవన్ని కేవలం పబ్లిక్ ప్లేస్ లో ఉంటున్న విగ్రహాలు మాత్రమేనని పోలీసుల పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసుకున్న చిన్న విగ్రహాలను ఈ లెక్కలో కలపలేదన్నారు. గత సంవత్సరం పోలిస్తే ఈ ఏడాది 8 వేలు విగ్రహాలు సంఖ్య పెరిగినట్లుగా డీజీపీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజులుగా 88 వేలు విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. గురువారం ఒక్కరోజే 6,350 విగ్రహాలు నిమజ్జనం జరిగాయి.ఇంకా 25, 500 విగ్రహాలు పెండింగ్ లో ఉన్నట్లుగా వెల్లడించారు. ఈసారి గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అవకతవకలు, అపశృతులు, అల్లర్లకు చోటు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగించేందుకు 25 వేల మంది తో హైదరాబాద్ లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా డీజీపీ తెలిపారు. ఏరియల్ సర్వే ద్వారా చూసామని ఇంకా నిమజ్జనాలు చాలా రావాల్సి ఉందన్నారు.
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం బందోబస్తులో భాగంగా ట్యాంక్ బండ్ క్రేన్ 2 దగ్గర డ్యూటీ చేస్తున్న కొత్తగూడెం టూ-టౌన్ ఎస్ఐ కె. వెంకన్నను గుర్తుతెలియని వాహనం ఢీకొన్న దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని వ్యాఖ్యానించారు. వెంకన్న మరణం ఆయన కుటుంబానికే కాకుండా మొత్తం పోలీసు శాఖకు తీరని లోటని సీఎం సంతాపం తెలిపారు. ఇక స్కూటర్‌తో ఢీకొట్టి కనీసం ఆగకుండా పారిపోయిన వారిని పట్టుకునేందుకు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. పట్టుబడిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎస్ఐ వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బాధ్యతారాహిత్యంగా వాహనం నడిపి ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.














