Last Updated:
తమిళ నటుడు అర్జున్ దాస్ వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తన ప్రత్యేకమైన గొంతు, నటనతో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తమిళ నటుడు అర్జున్ దాస్ వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తన ప్రత్యేకమైన గొంతు, నటనతో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన రొమాంటిక్ వెబ్‌సిరీస్ ‘#లవ్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
‘#లవ్’ వెబ్‌సిరీస్‌కు ‘మారన్’, ‘కాదల్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న బాలాజీ మోహన్ దర్శకత్వం వహించాడు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఈ సిరీస్‌కు షో రన్నర్‌గా వ్యవహరించడంతో పాటు నిర్మాతగానూ బాధ్యతలు చేపట్టాడు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
‘#లవ్’ కథ రెండు డేటింగ్ యాప్‌ల చుట్టూ తిరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. జీవిత భాగస్వామిని వెతుక్కునేందుకు ఉపయోగపడే రెండు యాప్‌లను నిర్వహించే సంస్థల యజమానుల చుట్టూ కథ సాగుతుంది. ఈ రెండు సంస్థలకు చెందిన వ్యక్తులు ఒక సందర్భంలో కలుసుకోవడంతో వారి జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలే సిరీస్‌లో ప్రధానంగా చూపించినట్లు అర్థమవుతోంది.
ప్రేమ, పెళ్లి, రిలేషన్‌షిప్స్‌పై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ముఖ్యంగా ఆధునిక కాలంలో డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయాలు ఏర్పడటం, ప్రేమలో పడటం, సంబంధాలు కొనసాగించడం వంటి అంశాలు సాధారణంగా మారిపోయాయి. అయితే ఈ సంబంధాల వెనుక ఉన్న భావోద్వేగాలు, నమ్మకాలు, అపోహలు, విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే విషయాన్ని ఈ సిరీస్‌లో చూపించబోతున్నట్లు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చారు.
ఈ సిరీస్‌లో అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య ఉండే సంబంధం కథకు కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్లో ప్రేమకు సంబంధించిన సన్నివేశాలతో పాటు రిలేషన్షిప్స్లో ఎదురయ్యే భావోద్వేగ సంఘర్షణలను కూడా చూపించారు. కేవలం ప్రేమకథగా కాకుండా.. ప్రస్తుతం సమాజంలో మారుతున్న సంబంధాలు, ప్రేమపై యువత ఆలోచనా విధానం, డేటింగ్ కల్చర్, భాగస్వామిని ఎంచుకునే విధానం వంటి అంశాలను కూడా కథలో టచ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వెబ్‌సిరీస్‌లో రొమాన్స్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్‌కు కూడా ప్రాధాన్యత ఉన్నట్లు అర్థమవుతోంది.














