Gun Fire: వ్యాయామం ఎలా చేయాలో చెప్తున్నాడు.. అంతలోనే వెనుక నుంచి బుల్లెట్ల వర్షం.. హరియాణాలోఘోరం! వీడియో వైరల్ | | ACTPnews

PC : X.com


Last Updated:

ఒక జిమ్ యజమాని (Gym Owner)ని గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

PC : X.com
PC : X.com

Gun Fire: హరియాణాలోని హన్సి (Hansi) పట్టణంలో గురువారం (జూన్ 11) తెల్లవారుజామున తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర హత్యోదంతం చోటుచేసుకుంది. ఒక జిమ్ యజమాని (Gym Owner)ని గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

యువతీ యువకులు చూస్తుండగానే కాల్పులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్సి పట్టణంలోని ప్రముఖ ఫవ్వారా చౌక్ (Fawwara Chowk) సమీపంలో ఈ ఘటన జరిగింది. సదరు జిమ్ యజమాని కొంతమంది యువతీ యువకులతో కూడిన గ్రూప్‌కు ఓపెన్ గ్రౌండ్‌లో (బహిరంగ ప్రదేశంలో) అవుట్‌డోర్ వ్యాయామ శిక్షణ (Outdoor exercise session) ఇస్తున్నాడు. అందరూ వర్కవుట్స్ చేయడంలో నిమగ్నమై ఉండగా ఈ ఘోరం జరిగింది.

సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు

అక్కడ ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల్లో ఈ దారుణానికి సంబంధించిన విజువల్స్ రికార్డయ్యాయి. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు.. వ్యాయామం చేయిస్తున్న జిమ్ ఓనర్ సమీపంలోకి వచ్చి, అత్యంత క్లోజ్ రేంజ్ (సమీపం) నుండి అతనిపై తుపాకీతో కాల్పుల వర్షం కురిపించారు. అనంతరం అక్కడి నుండి బైక్‌పై వేగంగా పరారయ్యారు. ఈ కాల్పుల ఘటనలో అక్కడే ఉన్న మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల దర్యాప్తు వేగవంతం

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగిందా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు హర్యానా పోలీసులు తెలిపారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ హత్య జరగడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports