Happy Birthday Modi: 25 ఏళ్ల నిస్వార్థ ప్రజాసేవ మీది.. మోదీకి చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్ బెస్ట్ విషెస్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

నేడు (సెప్టెంబర్ 17) భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

News18
News18

నేడు (సెప్టెంబర్ 17) భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ.. దేశానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు.

”దేశానికి సేవ చేయాలనే మీ పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. బలమైన, స్వావలంబన కలిగిన భారత్‌ కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మీ సేవా స్ఫూర్తి కోట్లాది మందిని ప్రభావితం చేస్తోంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. మన దేశానికి మరెన్నో సంవత్సరాలు సేవ చేసే శక్తి, అవకాశం మీకు లభించాలని ఆకాంక్షిస్తున్నాం. రాబోయే సంవత్సరం మీ జీవితంలో మరిన్ని విజయాలు, సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు సార్” అని పోస్ట్ పెట్టారు చిరంజీవి.

“ప్రధాని నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ బలం, వివేకం, సంకల్పం మరింత బలపడాలని కోరుకుంటున్నాను. మన గొప్ప దేశాన్ని నడిపించే మీ నిస్వార్థ ప్రయాణంలో మీకు ఆరోగ్యం, మనశ్శాంతి, అపారమైన శక్తి లభించాలని కోరుకుంటున్నా. #HappyBirthDayNarendraModiJi” అని అక్కినేని నాగార్జున పోస్ట్ పెట్టారు.

భారత్‌కు అంకితమైన జీవితం మీది. ఒక దేశ ఆకాంక్షలను, ఆశయాలను తీర్చిదిద్దుతూ కొనసాగుతున్న సేవా ప్రయాణం. 25 ఏళ్ల నిస్వార్థ ప్రజాసేవ మీది. రాబోయే సంవత్సరాల్లో కూడా భారత్‌కు మీరు చేసే సేవ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. మీరు చూపుతున్న అచంచలమైన నిబద్ధతకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పేర్కొంటూ స్టార్ హీరో, ఏపీ ఉప ముఖ్యమంతి పవన్ కళ్యాణ్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports