Harish Rao : రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ధ్వజం.. ఉద్యోగాల లెక్కలపై నిలదీత | ACTPnews

Harish Rao  : రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ధ్వజం.. ఉద్యోగాల లెక్కలపై నిలదీత



ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మంగళవారం (మార్చి 31, 2026) తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో అన్ని హామీలు అమలు చేశామంటూ రేవంత్ రెడ్డి కేరళలో అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. నిన్న జరిగిన గ్రామ సభల్లో ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీశారని, రేవంత్ రెడ్డి పీఠం కదులుతోందని వ్యాఖ్యానించారు. 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి, కేవలం 16 వేల ఉద్యోగాలే ఇచ్చామని అసెంబ్లీలో ప్రభుత్వం ఒప్పుకుందని గుర్తు చేశారు. “ఇంట్లో ఈగల మోత ఉంటే.. కేరళలో పల్లకీలు మోస్తున్నావు” అంటూ రేవంత్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక్కడ హామీలే సక్కగా అమలు చేయలేకపోయారు కానీ, కేరళలో అమలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని హరీష్ రావు ఎద్దేవా చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *