Last Updated:
Honour Killing: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అత్యంత హేయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ పరువు తీసిందన్న నెపంతో 22 ఏళ్ల యువతిని ఆమె కన్నతండ్రి, సొంత అన్నే అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు.
అనంతరం దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విచారణలో బట్టబయలైంది. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న సోఫియా (22) అనే యువతి దాదాపు నెల రోజుల క్రితం, ఆగస్టు 12వ తేదీ రాత్రి తీవ్ర గాయాలపాలైంది. బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ‘హిట్ అండ్ రన్’ కేసుపై లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.














