Husharu Pittalu Movie: హుషారు పిట్టలు మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్.. సింగర్ మంగ్లీ అదరగొట్టేసింది..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు.

News18
News18

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కాగా తాజా ఈ చిత్రం నుంచి ‘టోంగా టోంగా’ అనే ఓ హుషారు గీతాన్ని బుధవారం విడుదల చేశారు. చరణ్‌ అర్జున్‌ సంగీత దర్శకత్వంలో ఎస్‌.ఎస్‌.చిరంజన్‌ సాహిత్యంతో, మెయిన్‌ కొరియోగ్రఫీతో ఈ పాట తెరకెక్కింది.

హీరో అన్షు మాట్లాడుతూ .. నా ఫేవరెట్‌ సింగర్‌ మంగ్లీ నా సినిమాలో పాట పాటడం ఆనందంగా ఉంది. ఈ పాటకు మంచి ట్యూన్‌ను చరన్‌ అర్జున్‌ అందించారు. ఈ రోజు నా ఆత్మవిశ్వాసానికి కారణం దర్శకుడు బిక్షు, నిర్మాత వెంకట్‌ గారు. టీజర్‌ విడుదల చేశాం. చాలా వైరల్‌ అయ్యింది. టీజర్ చూసి అందరూ మిస్‌ అండర్‌స్టాండింగ్‌ చేసుకున్నారు. సినిమా చూసిన తరువాత అందరి ఆలోచన మారిపోతుంది. సినిమాలో అసలైన మ్యాటర్‌ సినిమాలో ఉంది. నా సినిమాలో ఉన్న కంటెంట్‌ నాతో ఇంత కాన్ఫిడెన్స్‌ను ఇచ్చింది’ అన్నారు.

హీరోయిన్‌ వాసవి గణేషన్‌ మాట్లాడుతూ .. దర్శకుడు, నిర్మాత సజేషన్‌తో ఈ సినిమా చేశాను. సురేష్‌ ప్రొడక్షన్స్‌, బెక్కెం వేణుగోపాల్ సహకారంతో ఈ సినిమా స్ట్రాంగ్‌ అయ్యింది. టోంగా.,. టోంగా పాట అందరికి నచ్చుతుంది. ఈ సినిమా టీజర్‌తో నాకు చాలా నెగెటివ్‌ కామెంట్స్‌ పెట్టారు. అయితే వాసవి గణేషన్‌ వేరు… పుట్ట చిట్టి వేరు.. ఎవ్వరూ ఏమనుకున్నా సినిమా చూసిన తరువాత మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను’ అన్నారు.

చరణ్‌ అర్జున్‌ మట్లాడుతూ.. తొలిసారిగా నేను మ్యూజిక్‌ అందించిన చిత్రంలో ఓ సాంగ్‌కు ఈవెంట్‌ పెట్టడం సంతోషంగా ఉంది. ఈ పాటను ఎంతో సందడిగా, హుషారుగా చేశాం. ఈ సినిమాలో అన్ని తరహా పాటలు ఉంటాయి. ఈ చిత్ర దర్శకుడు ఎంతో రూటెడ్‌.. ఈ సినిమా టీజర్‌ విడుదలైన తరువాత ఎంతో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదరుచూస్తున్నారు. ఆగస్టు 15న నాకు స్పెషల్‌ డే. ఆ రోజు ఈ సినిమా విడుదల కావడం నాకు ఎంతో ఎమోషన్‌గా ఉంది. తెలుగు సినిమా చరిత్రలో బిక్షు ఓ రూటెడ్‌ డైరెక్టర్‌గా ఎదుగుతాడు. ఈ సినిమాకు పనిచేస్తున్నప్పుడు నాకు ఓ సూపర్‌హిట్‌ సినిమాకు పనిచేస్తున్న వైబ్‌ కలిగింది. ప్రేక్షకులకు కూడా అదే ఫీల్‌ కలుగుతుందని నమ్ముతున్నాను’ అన్నారు.

దర్శకుడు బిక్షు మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్‌ తరువాత నన్ను అందరూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తూ తిట్టడం స్టార్ట్‌ చేసి నన్ను పాపులర్‌ చేశారు. అందరూ ఏదోదో ఊహించుకున్నారు. ఈ సినిమా విడుదల తరువాత సినిమా చూసి అందరూ మీరు సోషల్‌ మీడియాలో చేసిన నెగెటివ్‌ కామెంట్స్‌ వెనక్కి తీసుకుంటారు. అయితే ఇదే సినిమాను ఏ తమిళంలో, మలయాళంలో తీసి టీజర్‌ను విడుదల చేస్తే అందరూ ప్రశంసించేవారు. కానీ తెలుగు వాళ్లు మనకు చిన్న చూపు. తెలుగులో హుషార్‌ పిట్టలు ట్రెండ్‌ సృష్టించబోతుంది. విడుదల తరువాత ఇతర భాషల్లో ఈ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటారు. పుట్ట చిట్టి పాత్రకు వాసవి ప్రాణం పోసింది. అందుకే ఆమె కాళ్లు మొక్కుతున్నాను. ఈ రోజు మా కాన్ఫిడెంట్‌కు కారణం ఏమిటో ఈ సినిమా విడుదల తరువాత అందరికి తెలుస్తుంది’ అన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports