Hyderabad: నిమ్స్ ఆరోగ్యశాఖ అధికారికి అవినీతి జబ్బు.. అక్రమాస్తులపై 12 చోట్ల మెరుపు దాడులు | తెలంగాణ వార్తలు | ACTPnews

NIMS Hyderabad ACB Raids


Last Updated:

Hyderabad: హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ చిక్కారు. ఆయన లెక్కకు మంచి ఆస్తులు కూడబెట్టారని.. భారీ మొత్తంలో సంపద కలిగి ఉన్నట్లుగా వచ్చిన ఆరోపణలతో ఏసీబీ అధికారులు అతని నివాసం, బంధువుల ఇళ్లలో మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఒకటి రెండు కాదు మొత్తం మూడు జిల్లాల్లో 12 చోట్ల ఏసీబీ బృందాలు అక్రమాస్తుల చిట్టా బయటకు లాగుతున్నారు.

NIMS Hyderabad ACB Raids
NIMS Hyderabad ACB Raids

Hyderabad: తెలంగాణలో అవినీతిశాఖ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వాళ్లు, కోట్లాది అక్రమాస్తులు పోగుచేసుకున్న అధికారుల కోసం వేసిన వలలో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ చిక్కారు. ఆయన లెక్కకు మంచి ఆస్తులు కూడబెట్టారని.. భారీ మొత్తంలో సంపద కలిగి ఉన్నట్లుగా వచ్చిన ఆరోపణలతో ఏసీబీ అధికారులు అతని నివాసం, బంధువుల ఇళ్లలో మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఒకటి రెండు కాదు మొత్తం మూడు జిల్లాల్లో 12 చోట్ల ఏసీబీ బృందాలు అక్రమాస్తుల చిట్టా బయటకు లాగుతున్నారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఎంత ఆస్తులు కలిగి ఉన్నారనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నిమ్స్ ఆరోగ్యశాఖ అధికారికి అవినీతి జబ్బు..

తెలంగాణలో అవినీతి సొమ్ముకు అలవాటు పడిన అధికారుల చిట్టా రోజు రోజుకు పెరుగుతోంది. వైట్ కాలర్ ముసుగులో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడి అందినంత సొమ్ము పోగుచేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు అధికారులు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్‌ ని కూడా ఇవే ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు లక్ష్మీ భాస్కర్ నివాసం, బంధువుల సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు జిల్లాల్లో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. లక్ష్మీభాస్కర్‌పై గతంలో కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అడ్డగోలుగా అక్రమ సంపాదన..

నీమ్స్ ఆసుపత్రిలో ఏసీబీ సోదాలు జరగడం ఇదే మొదటసారి. లక్ష్మీ భాస్కర్‌పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నిమ్స్ ఆసుపత్రి నియామకాల్లో స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాల పేరుతో 90 పోస్టుల భర్తీ విషయంలో భారీగా ముడుపులు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతోనే ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. తనపై మీడియాలో వార్తలు రావడంతో లక్ష్మీ భాస్కర్ నిమ్స్‌లో మీడియాకు అనుమతి ఇవ్వొద్దంటూ సూపరింటెండెంట్‌కి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈయన ఇప్పటి వరకు ఎన్ని అక్రమాస్తులు కూడబెట్టారు..? ఇందులో ఎంత మంది ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఉన్నారనే విషయాన్ని ఏసీబీ రాబడుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

12 చోట్ల ఏసీబీ సోదాలు..

గతంలో ఇదే తరహాలో ఈఎస్ఐ ఆసుపత్రి ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో పరికరాల కొనుగోళ్లలో భారీ అక్రమాలకు పాల్పడిన మాజీ డైరెక్టర్ చింతకుంట దేవికారాణి కూడా ఇదే తరహాలో భారీగా అవినీతికి పాల్పడ్డారు. అప్పట్లో ఆమె వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా తేల్చారు ఏసీబీ అధికారులు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed