Hyderabad Crime: కూతురిపై కన్నేసిన కసాయి తండ్రి.. గొడ్డలితో నరికి చంపిన భార్య! | తెలంగాణ వార్తలు | ACTPnews

Hyderabad Crime: కూతురిపై కన్నేసిన కసాయి తండ్రి.. గొడ్డలితో నరికి చంపిన భార్య!


Last Updated:

హైదరాబాద్‌లో దారుణం.. భార్య చేసిన పనికి మైండ్ బ్లాక్..భర్తను గొడ్డలితో నరికేసింది!

Hyderabad Crime: కూతురిపై కన్నేసిన కసాయి తండ్రి.. గొడ్డలితో నరికి చంపిన భార్య!
Hyderabad Crime: కూతురిపై కన్నేసిన కసాయి తండ్రి.. గొడ్డలితో నరికి చంపిన భార్య!

సమాజంలో కన్నతండ్రి అంటే పిల్లలకు ఓ భరోసా. కానీ ఆ తండ్రే కీచకుడిగా మారితే? కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపైనే అఘాయిత్యానికి తెగబడితే? ఆ ఘోరాన్ని చూసిన ఓ తల్లి సహించలేకపోయింది. బిడ్డను కాపాడుకునేందుకు సాక్షాత్తూ కాళికామాతలా మారింది. కన్నబిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన కసాయి భర్తను గొడ్డలితో నరికి చంపింది. సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ దారుణ సంఘటన ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మచ్చ బొల్లారం డివిజన్‌లోని పెద్ది పరమారెడ్డి కాలనీలో బొడ్డు శ్రీనివాస్, రమాదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు ఉన్నారు. బయటకు సాధారణ కుటుంబంలా కనిపించినా.. ఆ ఇంట్లో రోజూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉండేది. ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లో ఆ ఇంటి నుంచి పెద్దపెద్దగా అరుపులు, కేకలు వినిపించేవని స్థానికులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతుండేవని చుట్టుపక్కల వారు స్పష్టం చేశారు. ఆ గొడవలకు అసలు కారణం శ్రీనివాస్ నీచమైన బుద్ధేనని ఆ తర్వాతే వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: AP Govt: ప్రభుత్వం బంపర్ ఆఫర్.. దరఖాస్తు చేసుకుంటే రూ.2 లక్షలు మీ సొంతం.. అర్హతలు ఇవే!

కన్న కూతురు అనే వావివరుసలు మరిచిన శ్రీనివాస్ పశువులా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కూతురిపైనే కన్నేసి పైశాచిక ఆనందం పొందాలని చూశాడు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి తన రాక్షస బుద్ధిని బయటపెట్టాడు. ఇంట్లో ఎవరూ గమనించడం లేదనుకుని సొంత కూతురిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కళ్లెదుటే భర్త చేస్తున్న ఈ దారుణాన్ని చూసిన రమాదేవి ఆవేశంతో ఊగిపోయింది. బిడ్డ ప్రాణాలను, మానాన్ని కాపాడుకునేందుకు క్షణాల్లో కఠిన నిర్ణయం తీసుకుంది. ఆవేశంతో ఇంట్లో ఉన్న గొడ్డలిని చేతబట్టింది.

ఇది కూడా చదవండి: Electric Scooter: రూ.1 కట్టనవసరం లేదు, 5 ఏళ్లు వారంటీ, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై 0 డౌన్ పేమెంట్ ఆఫర్!

బిడ్డను రక్షించుకునే క్రమంలో రమాదేవి ఉగ్రరూపం దాల్చింది. కామంతో విచక్షణ కోల్పోయిన భర్త శ్రీనివాస్‌పై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసింది. ఆమె కొట్టిన దెబ్బలకు తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో క్షణాల వ్యవధిలోనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ హఠాత్పరిణామంతో భయాందోళనలకు గురైన పిల్లలు గట్టిగా కేకలు వేశారు. ఆ అరుపులు విన్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీనివాస్‌ను చూసి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

స్థానికుల సమాచారంతో అల్వాల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కన్నబిడ్డను కాపాడుకునేందుకు భర్తను హతమార్చిన రమాదేవి.. ఆ తర్వాత తన పిల్లలతో సహా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్న కూతురిపైనే అఘాయిత్యానికి యత్నించి ప్రాణాలు పోగొట్టుకున్న తండ్రి ఉదంతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ షాకింగ్ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed