Last Updated:
మెట్రో ప్రయాణం చేసే వారికి భారీ ఊరట. టైమింగ్స్ మార్చారు. వినాయకుడి నిమజ్ఝనం సందర్భంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనం ఒక అద్భుతమైన మహా ఘట్టం. గల్లీగల్లీలో కొలువుదీరిన బొజ్జ గణపయ్యలకు అత్యంత భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికేందుకు నగరవాసులు భారీగా సన్నద్ధమయ్యారు. ఖైరతాబాద్ మహాగణపతితో సహా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు కదులుతుంటే ఆ దృశ్యం వర్ణనాతీతంగా ఉంటుంది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి సైతం ఈ శోభాయాత్రలను కనులారా వీక్షించేందుకు లక్షలాది మంది ప్రజలు హైదరాబాద్‌కు ఉత్సాహంగా తరలివస్తారు. డప్పు చప్పుళ్లు, భక్తుల నృత్యాలు, జై బోలో గణేష్ మహరాజ్ కీ జై అనే నినాదాలతో భాగ్యనగరం పండుగ శోభను పూర్తిగా సంతరించుకుంటుంది.
ఈ పండుగ ఉత్సాహంలో భక్తులను తీవ్రంగా వేధించే ప్రధాన సమస్య ట్రాఫిక్ రద్దీ. నిమజ్జనం రోజున నగరంలోని ప్రధాన రహదారులన్నీ పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలతో పూర్తిగా మూసుకుపోతాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతారు. సొంత వాహనాల్లో వెళ్లే వారికి పార్కింగ్ కష్టాలు ప్రతి ఏడాదీ తప్పనిసరి అవుతాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, వాహనం ఎక్కడ నిలపాలో తెలియక సతమతం కావడం భక్తులను తీవ్ర అలసటకు గురిచేస్తాయి. కిలోమీటర్ల మేర నడవాల్సి రావడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు బాగా ఇబ్బంది పడతారు. ఇలాంటి అనవసర ఇబ్బందుల కారణంగా చాలామంది పండుగ ఆనందాన్ని ఆస్వాదించలేకపోతారు.
ప్రజలు ఎదుర్కొనే ఈ రవాణా కష్టాలకు శాశ్వత చెక్ పెడుతూ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. నిమజ్జనానికి వెళ్లే వారి సౌకర్యార్థం మెట్రో సేవలను ప్రత్యేకంగా పొడిగిస్తూ సంస్థ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ రద్దీని సులువుగా అధిగమించి, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా అధికారుల బృందం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. పార్కింగ్ సమస్యలు లేకుండా, ప్రశాంతంగా వినాయకుడి శోభాయాత్రలో పాలుపంచుకునేందుకు మెట్రో ప్రయాణం బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందని అధికారులు స్పష్టం చేశారు. సంస్థ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో భాగ్యనగర వాసుల్లో తీవ్ర సంతోషం వ్యక్తమవుతోంది.
మెట్రో రైలు యాజమాన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం నాడు మెట్రో రైలు సేవలను అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. ఎల్బీ నగర్, మియాపూర్, రాయదుర్గం, నాగోల్ లాంటి మార్గాల్లో సాధారణ రోజుల్లో రాత్రి పదకొండు గంటలకే ముగిసే సేవలను సెప్టెంబర్ 26వ తేదీ శనివారం వేకువజామున ఒంటి గంట వరకు ప్రత్యేకంగా పొడిగించారు. నగరంలోని అన్ని ప్రధాన మెట్రో టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు శనివారం రాత్రి సరిగ్గా 1:00 గంటకు బయలుదేరుతుందని అధికారులు ప్రకటించారు. ఈ పొడిగింపు నిర్ణయంతో అర్ధరాత్రి దాకా ట్యాంక్ బండ్ వద్ద వేడుకలు చూసి ఇళ్లకు తిరిగి వెళ్లే లక్షలాది మందికి భారీ ఊరట లభించినట్లయింది.
సురక్షితమైన, సంతోషకరమైన నిమజ్జన వేడుకల కోసం నగరవాసులంతా మెట్రో సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి టెన్షన్ లేకుండా, ట్రాఫిక్ జాంలలో ఇరుక్కోకుండా గమ్యస్థానాలకు సాఫీగా ప్రయాణించేందుకు ఇంతకంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదని వారు గుర్తుచేస్తున్నారు. టికెట్ల కోసం క్యూలైన్లలో నిలబడకుండా ముందుగానే స్మార్ట్ కార్డులు వెంట తెచ్చుకోవడం మంచింది. కాలుష్యరహిత ప్రయాణాన్ని ఎంచుకుని పర్యావరణ పరిరక్షణలో కూడా భాగస్వాములు కావాలని మెట్రో సంస్థ కోరుతోంది. ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకుంటూ మీ ప్రయాణ బాధ్యతను హైదరాబాద్ మెట్రోకు వదిలేయండి అంటూ సంస్థ ప్రతినిధులు నగరవాసులకు పిలుపునిచ్చారు.














