Last Updated:
ఒక్క బీర్ కోసం ఇంత దారుణమా? బార్లో జరిగిన ఈ సీన్ చూస్తే వణికిపోతారు!
మద్యం మత్తులో విచక్షణ కోల్పోతున్న కొందరు చిన్న చిన్న కారణాలకే ప్రాణాల మీదకు తెస్తున్నారు. కేవలం ఒక బీర్ ఇవ్వలేదన్న నెపంతో ఏకంగా కత్తులతో దాడికి తెగబడిన దారుణ ఘటన హైదరాబాద్ నగర శివారులోని నార్సింగిలో చోటుచేసుకుంది. బుధవారం, ఆగస్టు 26వ తేదీ రాత్రి జరిగిన ఈ హఠాపరిణామంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కస్టమర్ల రూపంలో బార్లోకి అడుగుపెట్టిన దుండగులు అక్కడి సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి బీభత్సం సృష్టించారు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ రక్తపాతం చుట్టుపక్కల వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.














