Last Updated:
హైదరాబాద్లో షాకింగ్ ఘటన. పూడ్చిపెట్టిన పసిబిడ్డ డెడ్ బాడీ ఏమైంది? గంటల వ్యవధిలోనే ఊహించని పరిణామం.
కన్నబిడ్డను కోల్పోవడం ఏ తల్లిదండ్రులకైనా తీరని శోకం. ఒకేసారి ఇద్దరు కవల పిల్లలు ప్రాణాలు విడిస్తే ఆ బాధను వర్ణించడం ఎవరి తరం కాదు. పుట్టెడు దుఖంతో ఒక బిడ్డను ఖననం చేసి, ఆ వెంటనే మరో బిడ్డ మృతదేహంతో శ్మశానవాటికకు వెళ్లిన ఆ తల్లిదండ్రులకు అక్కడ ఊహించని ఘోరం ఎదురైంది. కళ్లెదుటే సురక్షితంగా పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అంతుచిక్కకుండా మాయమైన దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో తీవ్ర కలకలం రేపింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.














