Hyderabad Police Academy: హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కలకలం.. ట్రైనీ మహిళా ఐపీఎస్‌ ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన | తెలంగాణ వార్తలు | ACTPnews

హైదరాబాద్ పోలీస్ అకాడమీ


Last Updated:

Hyderabad Police Academy: దేశంలోనే అత్యున్నత పోలీస్ శిక్షణ కేంద్రమైన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో లైంగిక వేధింపుల ఉదంతం తీవ్ర కలకలం రేపింది.

హైదరాబాద్ పోలీస్ అకాడమీ
హైదరాబాద్ పోలీస్ అకాడమీ

ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణిపై మరో ట్రైనీ ఐపీఎస్ అధికారి వేధింపులకు దిగినట్లుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. అకాడమీలో శిక్షణ పొందుతున్న ఒక ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణికి, తోటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కొంతకాలంగా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఉదయ్‌కృష్ణారెడ్డి ప్రవర్తనతో తీవ్ర ఇబ్బందికి గురైన సదరు మహిళా అధికారిణి చివరకు చట్టపరమైన చర్యల కోసం పోలీసులను ఆశ్రయించారు. తన ప్రైవేట్ వీడియోలను తీసి భర్తకు పంపినట్లుగా సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. గదిలోకి బలవంతంగా లాక్కెల్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ వేధింపుల వ్యవహారంపై ఆమె శనివారం అత్తాపూర్ పోలీసు స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై లీగల్ విచారణ చేపట్టిన పోలీసులు, కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. దేశ రక్షణ బాధ్యతలు చేపట్టబోయే కాబోయే ఉన్నతాధికారుల శిక్షణా కేంద్రంలోనే ఇలాంటి ఘటన వెలుగుచూడటం టెక్ వర్గాల్లో, పోలీస్ శాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed