Last Updated:
IND vs ENG 3rd ODI: సిరీస్ విజేతను తేల్చే మూడో వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. పిచ్‌ను సద్వినియోగం చేసుకుంటూ.. పేలవ భారత బౌలింగ్‌పై విరుచుకు పడ్డారు. డకెట్, బెతెల్ శుభారంభం చేస్తే.. బట్లర్ అదిరిపోయే ఫినిష్ ఇచ్చాడు. మధ్యలో జో రూట్ మరోసారి అర్ధ సెంచరీతో కదం తొక్కాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 387 పరుగులు చేసింది. బెన్ డకెట్ (135 బంతుల్లో 141; 18 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో కదం తొక్కాడు. బెతెల్ (93 బంతుల్లో 91; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టాడు. జో రూట్ (48 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు) తన ఫామ్‌ను ప్రదర్శించాడు. రూట్‌కు ఇది హ్యాట్రిక్ అర్ధ సెంచరీలు. ఇక చివర్లో జాస్ బట్లర్ (13 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చుక్కలు చూపించాడు. ఫలితంగా ఇంగ్లండ్ భారీ స్కోరును సాధించింది. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణకు 2 వికెట్లు లభించాయి. మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇప్పుడు భారత బ్యాటర్ల మీదే భారం.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నిర్ణయం సరైనదే అంటూ ఓపెనర్లు బెన్ డకెట్, జాకబ్ బెతెల్‌లు దూకుడుగా ఆడారు. వీరిద్దరు బౌండరీల వర్షం కురిపించారు. బుమ్రా లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. వీరిద్దరు తొలి వికెట్‌కు ఏకంగా 192 పరుగులు జోడించారు. అనంతరం బెతెల్ 91 పరుగుల వద్ద అవుటయ్యాడు. అనంతరం వచ్చిన రూట్‌తో కలిసి డకెట్ ఇంగ్లండ్ స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలో డకెట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి ఇది నాలుగో వన్డే సెంచరీ కావడం విశేషం. వీరిద్దరు రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించారు. అనంతరం డకెట్ అవుటయ్యాడు. అనంతరం వచ్చిన బ్రూక్ (14) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు.
47వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన జాస్ బట్లర్ మెరుపులు మెరిపించాడు. ఎదుర్కొన్న 13 బంతుల్లో 7 బంతులను బౌండరీలు బాదాడు. ఇందులో 4 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉండటం విశేషం. దాంతో ఇంగ్లండ్ స్కోరు పాదరసంలా పెరిగింది. చివరి 5 ఓవర్లను టి20 తరహా ఆడారు. 48, 49 ఓవర్లలో 20కు పైగా పరుగులు సాధించారు. దాంతో ఇంగ్లండ్ చివర్లో ఒక 30 పరుగులు ఎక్కువగానే చేసింది. అయితే బ్యాటింగ్ పిచ్ కావడం.. భారత బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటంతో ఓపెనర్లు శుభారంభం చేస్తే లక్ష్యం ఛేజ్ చేయడం కష్టం కాదు. అయితే భారత బ్యాటర్లు ఆరంభంలో వికెట్లు కోల్పోరాదు. ఇంగ్లండ్ ఓపెనర్లు ఎలా అయితే ఆడారో అలా ఆడాలి. ఇక డెత్ ఓవర్లలో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














