వీటితో పాటు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో ఉన్న షెహజాదా ఫుడ్ మాస్టర్‌లో హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ దాడిలో, అపరిశుభ్రమైన పరిస్థితులలో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేసి, విక్రయిస్తున్నందుకు ఆ యూనిట్ యజమాని అయిన మహమ్మద్ ఫరూఖ్ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్స్, గమ్ పౌడర్ ఉప్పు కలిపి ఈ పేస్ట్‌ను తయారు చేసినట్లుగా గుర్తించారు. దుమ్ము, ఈగలు పడేలా తెరిచి ఉన్న ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ ఉంచినట్లు తెలుసుకొని రైడ్ నిర్వహించారు. ఆపరేషన్‌లో సుమారు 1,090 కిలోల కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 875 కిలోల పచ్చి అల్లం, వెల్లుల్లి, కల్తీకి ఉపయోగించే రసాయనాలు, గ్రైండింగ్ యంత్రాలు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 2.2 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.














