Siddu Jonnalagadda: ప్రిన్స్ రిసెప్షన్‌లో సిద్దూ జొన్నలగడ్డ.. అయ్యప్ప మాలలో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడుగా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

టాలీవుడ్ హీరో ప్రిన్స్ సెసిల్ రిసెప్షన్ నిన్న రాత్రి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు వెంకీమామ, సిద్దూ జొన్నలగడ్డ, తరుణ్, శ్రీకాంత్ ఇలా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. అయితే.. అందరి దృష్టి మాత్రం సిద్దూ జొన్నలగడ్డపైనే పడింది.

News18
News18

టాలీవుడ్ హీరో ప్రిన్స్ సెసిల్ రిసెప్షన్ నిన్న రాత్రి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు వెంకీమామ, సిద్దూ జొన్నలగడ్డ, తరుణ్, శ్రీకాంత్ ఇలా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. అయితే.. అందరి దృష్టి మాత్రం సిద్దూ జొన్నలగడ్డపైనే పడింది. ఈ ఈవెంట్‌కు ఆయన అయప్ప దీక్షలోనే వచ్చాడు. నలుపు రంగు దుస్తులతో చెప్పులు లేకుండా రావడంతో అందరూ షాక్ అయ్యారు.

అయితే.. మెడలో రుద్రాక్షమాల చూసి, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాడని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గతంలోనూ సిద్దూ జొన్నలగడ్డ మాల వేసుకున్నాడు. ‘తెలుసు కదా సినిమా పూజా కార్యక్రమానికి కూడా మాలలోనే వచ్చాడు. ఇక రీసెంట్‌‌గా సుమంత్ హీరోగా నటించిన ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రిలీజ్ టైమ్‌లో కూడా సిద్దూ జొన్నలగడ్డ మాలలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు సిద్దూ జొన్నలగడ్డ మూడు సార్లు మాల వేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక సిద్దూ జొన్నలగడ్డ సినిమాల విషయానికొస్తే.. 2009లో వచ్చిన జోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆరేంజ్, భీమిలీ కబట్టి జట్టు, డాన్ శీను… ఇలా చాలా సినిమాల్లో నటించాడు. కానీ ఏవీ కూడా సిద్దూ జొన్నలగడ్డకు క్రేజ్ తీసుకురాలేపోయాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన పదేళ్ళ తర్వాత ‘కృష్ణ అండ్ ఈజ్ లీలా’తో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది.

అయితే.. సిద్దూను ఓవర్ నైట్ స్టార్‌ను చేసింది మాత్రం ‘డీజే టిల్లు’ సినిమానే. చిన్న సినిమాగా రిలీజై సంచలన రికార్డులు క్రియేట్ చేసింది. అదే క్రేజ్‌తో సీక్వెల్‌ తీస్తే.. ఏకంగా రూ.120 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ రెండు సినిమాలు సిద్దూ జొన్నలగడ్డ కెరీర్‌నే మార్చేశాయి. ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లుగా ఉంటున్న రాని గుర్తింపు.. ఈ రెండు సినిమాలు తెచ్చిపెట్టాయి.

ఆ తర్వాత వచ్చిన జాక్, తెలుసు కదా సినిమాలు మాత్రం బెడిసి కొట్టాయి. ప్రస్తుతం సిద్దూ.. టిల్లూ క్యూబ్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గా సుమంత్ హీరోగా నటించిన మహేంద్రగిరి వారాహి సినిమాలో కూడా కీలక రోల్ ప్లే చేశాడు. ఈయన రోల్‌కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed