Impure Movie: టెక్ ఉద్యోగం నుంచి సినిమా రంగంలోకి.. ‘ఇంప్యూర్’తో వారాహి మల్లిపాముల సంచలన ఎంట్రీ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

వారాహి మల్లిపాముల ‘ఇంప్యూర్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి నిర్మాతగా, నటిగా, రచయిత్రిగా అరంగేట్రం చేస్తున్నారు. కాకినాడలో పుట్టిన వారాహి పెన్సిల్వేనియాలో పెరిగారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. ఆమె పెన్ స్టేట్ నుండి ఇంజనీరింగ్, జర్నలిజంలో డబుల్ మేజర్ పూర్తి చేశారు.

News18
News18

వారాహి మల్లిపాముల ‘ఇంప్యూర్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి నిర్మాతగా, నటిగా, రచయిత్రిగా అరంగేట్రం చేస్తున్నారు. కాకినాడలో పుట్టిన వారాహి పెన్సిల్వేనియాలో పెరిగారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. ఆమె పెన్ స్టేట్ నుండి ఇంజనీరింగ్, జర్నలిజంలో డబుల్ మేజర్ పూర్తి చేశారు. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, లండన్ వంటి నగరాల్లో జీవనోపాధి కోసం ఆమె టెక్ రంగంలో పనిచేశారు. కానీ తన సినిమా కలలను మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు. ఆమె ఆరు సంవత్సరాల క్రితం, పగలు ఉద్యోగం చేస్తూ, రాత్రులు, వీకెండ్స్‌లో స్క్రిప్ట్ రాస్తూ ఉండేవారు.

‘మా ఇంటి బంగారం’ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పని చేసిన నిశాంతి ఎవాని ‘ఇంప్యూర్’తో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఒక మహిళ కన్య కాదని ఆమె అత్తమామలకు తెలియడంతో ఆ పెళ్లిని రద్దు చేసే కథాంశంతో ‘వారాహి’ని తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమ తరచుగా తెలుగు పాత్రలకు ఉత్తర భారత మహిళలనే తీసుకుంటుంది. మహిళా ప్రాధాన్య చిత్రాలను అమ్మడం చాలా కష్టం. అందుకే వారహి ప్రధాన పాత్రలో తెలుగు మహిళ అయిన యషా ముత్తులూరిని తీసుకున్నారు. ఇక ‘ఇంప్యూర్’ చిత్ర విశేషాల గురించి వారాహి మల్లిపాముల మాట్లాడుతూ..

‘నేను ఎన్నో ఏళ్లుగా సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉండటం.. దగ్గరకు వచ్చి అవకాశాలు దూరం అవ్వడం వంటి సంఘటనల్ని అమ్మ చూశారు. మా చెల్లి పెళ్లికి మా అమ్మ చాలా ఖర్చు పెట్టారు. అందుకే ఆ డబ్బును సినిమాలో పెట్టాలనుకుంటే ఇస్తానని చెప్పారు. నేను ఆ ప్రతిపాదనను అంగీకరించాను. కానీ ఆ డబ్బుతో ఒక పూర్తి సినిమా తీయలేకపోయాను. మేము ఇంకా చాలా అప్పు చేశాం. నటీనటులు, సాంకేతిక నిపుణులను నియమించుకోవడానికి నేను న్యూయార్క్ నుండి వచ్చాను.”

నాకు చిన్నప్పటి నుంచే సినిమాపై బలమైన నమ్మకం ఉంది. కానీ మహిళా ప్రాధాన్య చిత్రాన్ని నిర్మించేలా నిర్మాతలను ఒప్పించడం అంత సులభం కాదు. నేను రాసిన స్క్రిప్ట్‌ని ఎంతో మంది నిర్మాతలకు వినిపించాను. చాలామంది తమ సందేహాలను వ్యక్తం చేశారు. చివరికి సమంత, నందిని రెడ్డి ఆ అపోహలను తొలగించి మహిళా ప్రాధాన్య చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆదరించవచ్చని నిరూపించారు. థియేటర్లలో ‘ఇంప్యూర్’ చిత్రాన్ని నేనే స్వయంగా పంపిణీ చేయడానికి వారే నాకు స్ఫూర్తినిచ్చారు.”

మా సినిమా కోసం రాజా కుమారి, కరణ్ పాండవ్‌లతో కలిసి పాటలు స్వరపరిచారు. వారిద్దరూ గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన కళాకారులు. ‘ఓఎమ్‌జి’ పాటలోని హుక్ స్టెప్‌ను ప్రజలు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది బాగా ప్రాచుర్యం పొందుతుందని ఆశిస్తున్నాను. సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్. మా సినిమా స్థాయిని పెంచారు. రక్తపాతంతో నిండిపోయిన చిత్రాల నుంచి మా ఇండిపెండెంట్ చిత్రాన్ని కాస్త భిన్నంగా చూడమని ప్రజలను కోరుతున్నాను. మా చిత్రం స్త్రీ, పురుషుల సమస్యలపై ఒక కొత్త దృక్కోణాన్ని అందిస్తుంది. సాయి కృష్ణ అద్భుతంగా నటించాడు. ‘ఇంప్యూర్’ అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ‘మా ఇంటి బంగారం’ చిత్రంలానే ‘ఇంప్యూర్’ సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

‘ఇంప్యూర్’ వరల్డ్ ప్రీమియర్ లాస్ ఏంజిల్స్‌లోని ప్రతిష్టాత్మక టిసిఎల్ చైనీస్ థియేటర్‌లో జరిగింది. ఆ తర్వాత న్యూయార్క్‌లోని చారిత్రాత్మక సినిమా విలేజ్‌లో ఈస్ట్ కోస్ట్ ప్రీమియర్ జరిగింది. ఈ చిత్రం అక్టోబర్ 2న పాన్-ఇండియా వ్యాప్తంగా పరిమిత థియేటర్లలో విడుదలవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports