IND vs PAK Final: పాకిస్తాన్‌ను రఫ్ఫాడించిన టీమిండియా.. ఫైనల్లో గెలుపు.. గోల్డ్ సొంతం | క్రీడా వార్తలు | ACTPnews

PC: BCCI

[ad_1]

Last Updated:

IND vs PAK Final: మరోసారి పాకిస్తాన్‌పై టీమిండియా (Team India)దే పైచేయి అయ్యింది. ఆసియా గేమ్స్ 2026 (Asian Games 2026)లో భాగంగా శనివారం జరిగిన పురుషుల క్రికెట్ ఫైనల్లో భారత జట్టు సూపర్ డూపర్ విక్టరీని అందుకుంది.

PC: BCCI
PC: BCCI

పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో గెలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. చివరి ఓవర్లో పాకిస్తాన్ విజయానికి 34 పరుగులు అవసరం కాగా.. శివమ్ దూబే కేవలం 13 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ఫలితంగా భారత జట్టు విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ బ్యాటర్ నవాజ్ (51 బంతుల్లో 96) ఒంటరి పోరాటం చేశాడు. అయితే బుమ్రా తన అద్భుత స్పెల్‌తో పాకిస్తాన్‌కు విజయాన్ని దూరం చేశాడు. 212 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే తలా 2 వికెట్లు సాధించారు. అయితే 18, 19వ ఓవర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పాయి. 18వ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక 19వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ రెండు ఓవర్లలో భారత్ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చింది. దాంతో చివరి ఓవర్లో పాకిస్తాన్ గెలవడానికి 34 పరుగులు అవసరం అయ్యాయి. అయితే చివరి ఓవర్లో దూబే కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో భారత్ మరోసారి అదరగొట్టింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 61; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఉతికారేశాడు. చివర్లో తిలక్ వర్మ (22 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అదిరిపోయే ఫినిష్ ఇచ్చాడు. దాంతో భారీ స్కోరు సాధించింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports