Last Updated:
IND vs WI 1st ODI: దాదాపు 70 రోజుల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు మరోసారి వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ 2027 (ODI World Cup 2027)కు వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌తో శంఖారావం పూరించనుంది.
వెస్టిండీస్‌తో జరిగే తొలి వన్డే ద్వారా దిగ్గజ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మళ్లీ బరిలోకి దిగనున్నారు. తిరువనంతపురం వేదికగా తొలి వన్డే జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వాస్తవానికి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటుందని అంతా అనుకున్నారు. అయితే గిల్ మాత్రం ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు బౌలర్లు.. ఇద్దరు ఆల్ రౌండర్లు.. ఆరుగురు బ్యాటర్లతో బరిలోకి దిగింది. నమన్ ధీర్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. అనూహ్యంగా సిరాజ్‌ను పక్కన పెట్టారు.
తుది జట్లు
జాన్ క్యాంప్ బెల్, జస్టిన్ గ్రీన్స్, కేసీ కార్టీ, షై హోప్, అమిర్ జంగూ, జివిల్ అండ్రూ, రోస్టన్ ఛేజ్, గుడకేష్ మోటి, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్
శుబ్మ్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, నమన్ ధీర్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ














