Last Updated:
Indian Woman In Canada Clashes: కెనడాలో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ తన అద్దెదారుడితో (టెనెంట్) పెట్టుకున్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారి చివరకు ఆమె అరెస్ట్‌కు దారితీసింది.
గార్డెన్లో బార్బెక్యూ చేసుకోవడంపై మొదలైన ఈ వివాదం వరుస ఘర్షణల రూపం దాల్చింది. సదరు అద్దెదారుడు ఈ వ్యవహారమంతటినీ వీడియోల రూపంలో రికార్డు చేసి, ‘తివానా ఫామ్ సర్వైవర్’ (Tiwana Farm Servivor) పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమానురాలు తనను నిరంతరం వేధిస్తోందని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని అతను ఆరోపించాడు.














