Last Updated:
India’s Tallest Family:సోషల్ మీడియా పుణ్యమా అంటూ దేశంలో, ప్రపంచంలో అరుదైన వ్యక్తులు, ప్రత్యేక లక్షణాలు కలిగిన వాళ్లను చూసే అదృష్టం కలుగుతోంది. ఇప్పుడు మీకు చెప్పబోయే వ్యక్తులు కూడా అలాంటి వాళ్లే. పూణేకు చెందిన కులకర్ణి కుటుంబం అంటే ఎవరైనా తలెత్తుకొని చూడాల్సిందే. అంటే వాళ్లు అంత గర్వపడే పని చేశారని అర్ధం కాదు.
India’s Tallest Family: మనుషులు చూడటానికి అందరికి ఒకే విధంగా శరీర అవయవాలు ఉంటాయి. అయితే కొందరికి మాత్రం కాస్త భిన్నంగా ఉండటం అరుదుగా చూస్తుంటాం. ఇప్పుడు మహరాష్ట్రలోని పూణెకి చెందిన ఓ ఫ్యామిలీని చూస్తే వామ్మో వీళ్లెంటి ఇంత పొడవుగా ఉన్నారని ఆశ్చర్యపోతారు. నిజమే ఒకరిద్దరు కాదు ఆ ఫ్యామిలీలోని నలుగురు వ్యక్తులను చూస్తే వరుసగా ఉన్న తాటిచెట్లను చూసినట్లుగా ఉంటుంది. శరద్ కులకర్ణి అనే ఈ వ్యక్తి ఫ్యామిలీ ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ఎత్తైన కుటుంబంగా నిలిచింది.ఇంటి పెద్ద ఏడు అడుగులకు పైన ఉంటే మిగిలిన వాళ్లంతా ఇంచుమించు ఆరున్నర అడుగుల ఎత్తున్నారు.
సోషల్ మీడియా పుణ్యమా అంటూ దేశంలో, ప్రపంచంలో అరుదైన వ్యక్తులు, ప్రత్యేక లక్షణాలు కలిగిన వాళ్లను చూసే అదృష్టం కలుగుతోంది. ఇప్పుడు మీకు చెప్పబోయే వ్యక్తులు కూడా అలాంటి వాళ్లే. పూణేకు చెందిన కులకర్ణి కుటుంబం అంటే ఎవరైనా తలెత్తుకొని చూడాల్సిందే. అంటే వాళ్లు అంత గర్వపడే పని చేశారని అర్ధం కాదు. ఎత్తులో వాళ్లను చూడాలంటే తలపైకి ఎత్తి చూడాల్సిందే. శరద్ కులకర్ణి అనే వ్యక్తి అసాధారణ ఎత్తుతో ప్రత్యేక గుర్తింపు పొందింది. కుటుంబంలోని నలుగురు సభ్యుల ఎత్తులను కలిపితే సుమారు 26 అడుగులు (26 feet) ఉంటుందని పలు నివేదికలు పేర్కొన్నాయి.
ఈ కుటుంబంలో శరద్ కులకర్ణి (Sharad Kulkarni)ఎత్తు సుమారు 7 అడుగుల 1.5 అంగుళాలు. ఆయన వయసు వచ్చేసి 63 సంవత్సరాలు. శరద్ మాత్రమే కాదు ఆయన సతీమణి సంజోత్ కులకర్ణి కూడా (Sanjot Kulkarni) ఎత్తు సుమారు 6 అడుగుల 2.6 అంగుళాలు.ఈమె వయసు 58 సంవత్సరాలు. ఈ పొడవైన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్లు కూడా తల్లిదండ్రుల వారసత్వాన్ని హైట్ రూపంలో సొంతం చేసుకున్నారు. పెద్దమ్మాయి మృగా కులకర్ణి(Mruga Kulkarni) వయసు 33 సంవత్సరాలు. ఈమె హైట్ వచ్చేసరికి 6 అడుగుల 2 అంగుళాలు ఉంది. ఇక చిన్న అమ్మాయి సాన్య కులకర్ణి (Sanya Kulkarni) వయసు 28 ఏళ్లు. ఈమె హైట్ విషయంలో అక్క, తల్లిని దాటిపోయింది. తండ్రితో పోటీ పడుతోంది. సాన్య కూడా 6 అడుగులకు పైగా ఎత్తు ఉన్నట్లు పాత నివేదికలు పేర్కొన్నాయి. ఈమె హైట్ వచ్చేసరికి 6 అడుగుల 4 అంగుళాలు ఉంది.
పూణెకు చెందిన శరద్ కులకర్ణి కుటుంబం భారతదేశంలోని అత్యంత ఎత్తైన కుటుంబంగా 2013 Limca Book of Recordsలో చేరిపోయింది. అంటే సుమారు 13 ఏళ్ల క్రితం వీళ్ల ఫ్యామిలీ మన దేశంలో ఎత్తుగా ఉన్న కుటుంబంగా వార్తల్లో నిలిచింది. 2013 జూలై 21న పూణేలో కుటుంబ సభ్యుల ఫొటోను Times of India ప్రచురించింది.
అయితే వీరి తర్వాత ఒకే ఫ్యామిలీలో ఇంత హైట్ ఉన్న వ్యక్తులుగా ఏ కుటుంబం ఉన్నట్లుగా రికార్డులు నమోదు కాలేదు. కాబట్టి కుటుంబ సభ్యుల మొత్తం ఎత్తు సుమారు 26 అడుగులుగా గుర్తించారు. ఇది పాత వార్త అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కుటుంబం ఇదే అని చెప్పడం సరైంది కాదు. అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం వీరిని భారతదేశంలో అత్యంత ఎత్తైన కుటుంబంగా గుర్తింపు పొందినప్పటికి ఇంకా వేరే ఎవరైనా ఉండవచ్చు అనే అవకాశం కూడా లేకపోలేదు.














