Allu Sirish: రేణూ దేశాయ్ బాటలో అల్లు శిరీష్.. డీజే సౌండ్స్‌‌పై సంచలన పోస్ట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

భక్తి పేరుతో కొందరు చేస్తున్న అత్యుత్సాహం సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అర్ధరాత్రి దాటినా వీధుల్లో, దేవుడి మండపాల వద్ద భారీ డెసిబెల్స్‌తో మోగుతున్న డీజేలు ప్రజలను ఇబ్బదులకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా అల్లు శిరీష్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

News18
News18

ప్రస్తుతం వరుస పండుగల సీజన్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి అంబరాన్నంటుతోంది. అయితే, భక్తి పేరుతో కొందరు చేస్తున్న అత్యుత్సాహం సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అర్ధరాత్రి దాటినా వీధుల్లో, దేవుడి మండపాల వద్ద భారీ డెసిబెల్స్‌తో మోగుతున్న డీజేలు (DJ sounds), మైక్‌ల హోరుతో వృద్ధులు, పసిపిల్లలు, రోగులు కంటిమీద కునుకు లేకుండా అవస్థలు పడుతున్నారు. తాజాగా ఇదే శబ్ద కాలుష్యంపై గళమెత్తిన టాలీవుడ్ యువ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి ఊహించని ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిపై ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందిస్తూ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.. అల్లు శిరీష్ ప్రస్తుతం హైదరాబాద్‌ షేక్‌పేటలోని అపర్ణా వన్ (Aparna One) అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, తన అపార్ట్‌మెంట్‌కు సమీపంలో ఉన్న వినోభానగర్‌లోని హనుమాన్ ఆలయం వద్ద గత కొద్దిరోజులుగా అర్ధరాత్రి 2 గంటల వరకు పెద్ద శబ్దాలతో డీజేలు మోగిస్తున్నారని ఆయన హైదరాబాద్ పోలీసులకు (Hyderabad Police) ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. వాస్తవానికి దీనిపై తాను గతంలోనే ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, అయితే గణేశ్ నిమజ్జనం పూర్తయ్యే వరకు కాస్త సహకరించాలని అప్పట్లో పోలీసులు సూచించారని ఆయన తెలిపారు. కానీ నిమజ్జనం ముగిసినప్పటికీ అర్ధరాత్రి డీజేల మోత ఆగకపోవడంతో.. స్థానికంగా ఉండే వృద్ధులు, చిన్నపిల్లలు, మరుసటి రోజు విధులకు వెళ్లాల్సిన ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆయన తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, సమాజ శ్రేయస్సు కోరి అల్లు శిరీష్ చేసిన ఈ ఫిర్యాదుపై కొందరు నెటిజన్లు మద్దతు తెలపగా, మరికొందరు మాత్రం దీన్ని వక్రీకరించి మతం రంగు పులిముతూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. పండుగ పూట భక్తి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఈ ట్రోల్స్‌పై అల్లు శిరీష్ వెంటనే స్పందించారు. “స్నేహితులారా.. నాకు మతంపై పూర్తి విశ్వాసం ఉంది. నేను నిత్యం హనుమంతుడిని పూజిస్తాను. కానీ, అర్ధరాత్రి 2 గంటల వరకు చెవులు పగిలిపోయేలా డీజే సౌండ్ పెట్టడాన్ని భక్తి అనిపించుకోరు. నేను ఫిర్యాదు చేసింది కేవలం సామాజిక బాధ్యత, స్పృహ (Civic Sense) లేకుండా వ్యవహరిస్తున్న తీరుపైనే తప్ప.. భక్తి మీద కాదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.. ధన్యవాదాలు” అంటూ తనను విమర్శించిన వారికి సుతిమెత్తగా, సూటిగా చురకలంటించారు.

నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత మైకులు, డీజేలు వినియోగించరాదని సుప్రీంకోర్టు, కాలుష్య నియంత్రణ మండలి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆచరణలో అవి అమలు కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల నటి రేణూ దేశాయ్ కూడా అర్ధరాత్రి డీజేల మోతపై స్పందించి తీవ్ర ట్రోల్స్‌కు గురైన విషయం తెలిసిందే. ఏది ఏమైనా భక్తి పేరుతో ఇతరుల ప్రాణాలకు, శాంతికి భంగం కలిగించే ఈ డీజే సంస్కృతిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed