విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? భారతీయుల కోసం శ్రీలంక నుంచి అదిరిపోయే ఆఫర్ | బిజినెస్ | ACTPnews

విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? భారతీయుల కోసం శ్రీలంక నుంచి అదిరిపోయే ఆఫర్ | బిజినెస్


ఈ రోడ్‌షోలో “వెడ్డింగ్ ప్లస్ హాలిడే” కాన్సెప్ట్‌పైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పెళ్లి వేడుకలకు వచ్చే కుటుంబ సభ్యులు, స్నేహితులు బీచ్ ట్రిప్స్, సాంస్కృతిక ప్రదేశాల సందర్శన, వైల్డ్‌లైఫ్ సఫారీ, వెల్‌నెస్ అనుభవాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించే ప్రయాణాలు, షాపింగ్, స్థానిక వంటకాల రుచిచూడటం వంటి వాటిని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. భారత్ నుంచి సులభంగా చేరుకునే అవకాశం, వివిధ రకాల వసతి సదుపాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులంతా కలిసి పెళ్లితో పాటు అంతర్జాతీయ హాలిడేను కూడా ఆస్వాదించవచ్చని శ్రీలంక టూరిజం తెలిపింది.

ఇది కూడా చదవండి: iPhone Offer: లక్షన్నర విలువైన ఐఫోన్ రూ.72 వేలకే కొనండి ఇలా… అదిరిపోయే ఆఫర్

రోడ్‌షో సందర్భంగా శ్రీలంక టూరిజం ప్రమోషన్ బ్యూరో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ చమిల జయరత్న మాట్లాడుతూ, “శ్రీలంకకు భారత్ ఎప్పటికీ ముఖ్యమైన మార్కెట్‌గానే ఉంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ ద్వారా ఈ సంబంధాన్ని మరింత బలపర్చుకునే మంచి అవకాశం ఉంది. భారతీయ జంటలు, కుటుంబాలు అందమైన ప్రదేశాలు, సులభమైన హాస్పిటాలిటీ, గుర్తుండిపోయే అనుభవాలు, సులభమైన ప్రయాణ సదుపాయాలను కోరుకుంటున్నారు. ఈ అన్ని అంశాలను శ్రీలంక ఒకే చోట అందిస్తుంది. పెళ్లికి సంబంధించిన నిర్ణయాలను తీసుకునే నిపుణుల దగ్గరకు ఈ అవకాశాలను నేరుగా తీసుకెళ్లేందుకు ఈ రోడ్‌షో ఉపయోగపడింది” అని చెప్పారు.

శ్రీలంక టూరిజం ప్రమోషన్ బ్యూరో చైర్మన్ బుద్ధిక హెవావాసం మాట్లాడుతూ, “భారత్ మా ఫోకస్ మార్కెట్‌గానే కొనసాగుతోంది. భారతీయ ప్రయాణికుల మారుతున్న ఆసక్తులకు తగ్గట్టుగా కొత్త అవకాశాలను అభివృద్ధి చేయడమే మా వ్యూహం. డెస్టినేషన్ వెడ్డింగ్స్ ద్వారా శ్రీలంకను కేవలం పెళ్లి వేదికగా కాకుండా, వేడుక, కొత్త ప్రదేశాల అన్వేషణ, కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం అన్నీ ఒకే ప్రయాణంలో భాగమయ్యే దేశంగా పరిచయం చేయవచ్చు. హైదరాబాద్, సూరత్, పుణేలో పెళ్లి ప్లానర్లు, ట్రావెల్ నిపుణులతో మాట్లాడటం ద్వారా శ్రీలంకపై అవగాహన పెంచాలని, పెళ్లి ప్లానింగ్ మొదటి దశ నుంచే శ్రీలంకను ఒక ఎంపికగా తీసుకురావాలని భావిస్తున్నాం” అని అన్నారు.

ఇది కూడా చదవండి: IRCTC Tour: రూ.18 వేలకే 7 జ్యోతిర్లింగాల దర్శనం… మరోసారి హైదరాబాద్ నుంచి 11 రోజుల యాత్ర

ఈ రోడ్‌షో కోసం హైదరాబాద్‌ను ఎందుకు ఎంచుకున్నారు? శ్రీలంక టూరిజం, డెస్టినేషన్ వెడ్డింగ్స్ విషయంలో హైదరాబాద్, తెలంగాణ నుంచి ఎంత అవకాశం ఉందని భావిస్తున్నారు? అని న్యూస్18 తెలుగు అడిగిన ప్రశ్నలపై శ్రీలంక టూరిజం ప్రమోషన్ బ్యూరో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ చమిల జయరత్న స్పందించారు. “శ్రీలంక డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రమోషన్ కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేయడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. హైదరాబాద్, తెలంగాణలో పెళ్లిళ్లకు చాలా ప్రాధాన్యం ఉంది. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి ప్రయాణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌కు శ్రీలంక చాలా దగ్గరగా ఉండటం, రెండు ప్రాంతాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సదుపాయాలు అందుబాటులో ఉండటం వల్ల శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఆలోచించే జంటలకు ఇది అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్‌లో అప్పర్ మిడిల్ క్లాస్ జనాభా గణనీయంగా పెరుగుతోంది. దీంతో విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు శ్రీలంకను ఒక ముఖ్యమైన అంతర్జాతీయ డెస్టినేషన్‌గా పరిచయం చేయడానికి హైదరాబాద్ మంచి మార్కెట్‌గా మారే అవకాశం ఉంది” అని చమిల జయరత్న వివరించారు.

ఇక విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడం కంటే ‘వెడ్ ఇన్ ఇండియా’ను ఎంచుకోవాలని ప్రధాని మోదీ భారతీయులను ప్రోత్సహిస్తుండగా, శ్రీలంక భారతీయుల పెళ్లిళ్లకు తమ దేశాన్ని డెస్టినేషన్‌గా ప్రమోట్ చేయడంపై స్పందిస్తూ, “భారత్ వెలుపల డెస్టినేషన్ వెడ్డింగ్స్‌పై పరిమితులు పెట్టడానికి కారణం దేశ విదేశీ మారక నిల్వలపై బాహ్య రంగం నుంచి వచ్చే ఒత్తిళ్లకు సంబంధించిన ఆందోళనలు అయి ఉండవచ్చు. అయితే శ్రీలంకలో భారత రూపాయిని గుర్తింపు పొందిన విదేశీ కరెన్సీగా పరిగణిస్తున్నారు. కాబట్టి భారత్ నుంచి శ్రీలంకకు వచ్చే వారు తమ పెళ్లి ఖర్చులను స్థానిక కరెన్సీ అయిన భారత రూపాయిలో చెల్లించవచ్చు. స్థానిక కరెన్సీలో ఖర్చు చేయడం వల్ల విదేశీ మారకద్రవ్యంపై పడే ఒత్తిడి చాలా తక్కువగా ఉండొచ్చు. భారతీయ జంటలకు శ్రీలంక డెస్టినేషన్ వెడ్డింగ్స్ విషయంలో ఇది ఒక పోటీ ప్రయోజనంగా మారవచ్చు” అని చమిల జయరత్న వివరించారు.

ఇది కూడా చదవండి: Solar Inverter: మీ ఇంట్లో మళ్లీమళ్లీ కరెంట్ పోతోందా? రూ.1600 ఈఎంఐతో ఈ సోలార్ ఇన్వర్టర్ మీ సొంతం

మూడు నగరాల్లో జరిగిన రోడ్‌షోలకు “ది హెరిటేజ్ ఆఫ్ కాండ్యన్” ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీలంక సంప్రదాయ నృత్య కళలను పరిచయం చేసే ఈ కార్యక్రమం ద్వారా ఆ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చూపించారు. శక్తివంతమైన తాళాలు, అందమైన నృత్య కదలికలు, సంప్రదాయ నృత్యంలోని రాజసమైన శైలిని పురుషులు, మహిళా నృత్యకారులు ప్రత్యేకమైన దుస్తులు, ఆభరణాలతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా వెడ్డింగ్ రంగంలో ఉన్న భాగస్వామ్యాలను మరింత బలపర్చుకోవాలని శ్రీలంక టూరిజం భావిస్తోంది. ప్రత్యేకమైన పెళ్లి వేడుకలకు శ్రీలంకను ఒక డెస్టినేషన్‌గా నిలబెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. సముద్ర తీరంలో ఘనంగా జరిగే పెళ్లి వేడుక అయినా, కొండ ప్రాంతంలో సన్నిహితులతో జరిగే చిన్న వేడుక అయినా, ప్రతి పెళ్లిని ప్రేమ, కొత్త అనుభవాలు, కుటుంబ సభ్యులతో కలిసి గడిపే మధుర జ్ఞాపకంగా మార్చుకోవచ్చని శ్రీలంక టూరిజం చెబుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed