IPL 2026 Controversy: శ్రేయస్ అయ్యర్ సిస్టర్‌పై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన శ్రేష్ఠ | క్రీడా వార్తలు | ACTPnews

శ్రేయస్ అయ్యర్ సోదరి


Last Updated:

శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్‌ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోలింగ్‌కు దిగారు. దీనిపై శ్రేష్ఠ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ అత్యంత ఘాటుగా స్పందించారు.

శ్రేయస్ అయ్యర్ సోదరి
శ్రేయస్ అయ్యర్ సోదరి

IPL 2026 Controversy: భారత క్రికెట్‌లో ఫ్యాన్స్ టాక్సిక్ కల్చర్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ (PBKS) కేవలం ఒక్క పాయింట్ తేడాతో ప్లేఆఫ్స్ అర్హతను కోల్పోయింది. ఈ నేపథ్యంలో, టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్‌ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోలింగ్‌కు దిగారు. దీనిపై శ్రేష్ఠ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ అత్యంత ఘాటుగా స్పందించారు.

అసలేం జరిగింది?

ఈ సీజన్ ప్రారంభంలో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగాల్సిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ సమయంలో పంజాబ్‌కు ఒక పాయింట్ లభించడంతో శ్రేష్ట సరదాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేశారు. అయితే, లీగ్ దశ ముగిసేసరికి పంజాబ్ జట్టు సరిగ్గా అదే ఒక్క పాయింట్ తేడాతో ప్లేఆఫ్స్ రేస్ నుండి తృటిలో తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో పాత వీడియోను నెటిజన్లు మళ్లీ తెరపైకి తెచ్చి, ఆమెను విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు.

ఆఫీస్‌కు ఫోన్లు చేసి మరీ వేధింపులు

ఈ ట్రోలింగ్ కేవలం ఆన్‌లైన్ కామెంట్లతో ఆగకుండా వ్యక్తిగత వేధింపుల వరకు వెళ్లిందని శ్రేష్ట ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఏకంగా తను పని చేసే ఆఫీస్‌కు ఫోన్లు చేసి సహోద్యోగులను, విద్యార్థులను వేధిస్తున్నారని వెల్లడించారు.

వీడియోలో ఆమె మాట్లాడుతూ.. “మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తోంది. మీరు నా కార్యాలయానికి ఫోన్లు చేస్తూ నన్ను, నా సహోద్యోగులను, నా విద్యార్థులను మరియు నా కుటుంబాన్ని ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఫోన్లు చేసి బూతులు తిడుతూ వేధిస్తున్నారు. నాపై ద్వేషం ఉంటే నన్ను తిట్టండి, అంతేగానీ నాతో సంబంధం ఉన్న వ్యక్తులను ఇబ్బంది పెట్టడం ఆపండి” అని మండిపడ్డారు.

కేవలం సరదా కోసమే చేశా

“గతంలో నేను చేసిన వీడియో కేవలం ఒక ‘ఫన్ బాంటర్’ మాత్రమే. దాన్ని మీరు చాలా పెద్దది చేసేశారు. నా రీల్ వెనుక ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవు, ఎవరిపైనా ద్వేషం చల్లే ప్రయత్నం నేను చేయలేదు. నా సోదరుడు కూడా ఒక క్రికెటరే కాబట్టి నాకు ప్రతి క్రికెటర్ అంటే గౌరవం ఉంది. నా తమ్ముడు గెలిచినా, ఓడినా నేను ఎప్పుడూ అతడిని సపోర్ట్ చేస్తూనే ఉంటాను” అని శ్రేష్ఠ స్పష్టం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *