Last Updated:
రాజస్థాన్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరుకున్న వేళ.. ప్లేఆఫ్స్ రేసును మరింత హీట్‌ఎక్కించే మ్యాచ్‌కు జైపూర్ వేదికైంది. మంగళవారం జరుగుతున్న 64వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఇప్పటికే మూడు ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారవ్వగా.. మిగిలిన ఒక్క స్థానం కోసం ఐదు జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.
టాస్ వద్ద అదృష్టం రాజస్థాన్ రాయల్స్ వైపు నిలిచింది. టాస్ గెలిచిన స్టాండ్ ఇన్ కెప్టెన్ యశస్వి జైస్వాల్ ఎలాంటి సందేహం లేకుండా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రియాన్ పరాగ్ దూరం కావడంతో ఈ కీలక మ్యాచ్‌లో జట్టును నడిపించే బాధ్యత జైస్వాల్ భుజాలపై పడింది. యువ కెప్టెన్‌గా అతడికి ఇది పెద్ద పరీక్షగా మారింది.
ఈ మ్యాచ్‌కు రెండు జట్లు కూడా భారీ మార్పులతో బరిలోకి దిగాయి. రాజస్థాన్, లక్నో చెరో మూడు మార్పులు చేసి తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను మరింత బలపరిచాయి. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు రంగంలోకి దిగాయి.
ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసు అత్యంత ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో పాటు పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా రేసులో ఉన్నాయి. అయితే ఈ జట్లన్నింటిలో రాజస్థాన్ పరిస్థితి కొంత మెరుగ్గానే కనిపిస్తోంది. తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ఎలాంటి నెట్ రన్‌రేట్ లెక్కలు లేకుండానే నేరుగా 16 పాయింట్లతో టాప్-4లోకి ఎంట్రీ ఇవ్వగలదు.
యశస్వి జైస్వాల్ (C), లువాన్-డ్రే ప్రిటోరియస్, ధృవ్ జురెల్(WK), డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, సుశాంత్ మిశ్రా, సందీప్ శర్మ, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా
మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(WK/C), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆకాష్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














