Tirumala: తిరుమల కొండపైకి ఖరీదైన భక్తుడు.. 5కేజీల నగలు వేసుకొచ్చిన గోల్డ్‌మెన్, అతనెవరో తెలుసా..? | ట్రెండింగ్ | ACTPnews

News18


Last Updated:

Tirumala: తిరుమలేశుడి దర్శనం కోసం ఓ స్వర్ణమయ భక్తుడు అంటే ఒంటిపై కేజీల బరువున్న నగలు ధరించి వచ్చాడు. కొండపైకి వచ్చిన గోల్డ్ మెన్‌ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిచూపించారు.

+

News18

Tirumala: వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకొని ముక్కులు తీర్చుకుంటారు. అయితే బుధవారం ఉదయం తిరుమలేశుడి దర్శనం కోసం ఓ స్వర్ణమయ భక్తుడు అంటే ఒంటిపై కేజీల బరువున్న నగలు ధరించి వచ్చాడు. కొండపైకి వచ్చిన భక్తుల్లో ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హైదరాబాద్‌కు చెందిన హోప్ ఫౌండేషన్ అధినేత కొండా విజయ్ కుమార్ భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు ధరించి తిరుమలకు రావడంతో భక్తుల దృష్టి అంతా ఆయన వైపు మళ్లింది.

కొండపై స్వర్ణమయ భక్తుడు..

విఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న విజయ్ కుమార్ ఒంటిపై దాదాపు ఐదు కిలోల బంగారు నగలను ధరించడం చర్చనీయాంశమైంది. రెండు చేతుల వేళ్లన్నింటికీ బంగారు ఉంగరాలు, భారీ కంకణాలు, మెడ నిండా మందమైన బంగారు గొలుసులతో దర్శనానికి వచ్చిన ఆయనను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. క్యూలైన్లలో ఉన్న పలువురు భక్తులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపగా, మరికొందరు “గోల్డ్ మ్యాన్” అంటూ చర్చించుకున్నారు. తిరుమలలో భక్తి వాతావరణం మధ్య ఆయన ధరించిన బంగారు ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా సినీ నటి..

అదే సమయంలో తెలుగు సినీ నటి మణి చందన కూడా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆమె దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల నుంచి ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఆలయ పరిసరాల్లో అభిమానులు ఆమెను చూసేందుకు ఆసక్తి చూపగా, ఆమె భక్తులతో ఆత్మీయంగా పలకరించారు. ఒకవైపు బంగారు ఆభరణాలతో వచ్చిన “గోల్డ్ మ్యాన్”, మరోవైపు సినీనటి మణి చందన దర్శనం.

గతంలో మరికొందరు..

తిరుమల శ్రీవారిని గోల్డ్ మెన్ దర్శించుకోవడం ఇప్పుడు కొత్తేమి కాదు. గతంలో కూడా అంటే గతేడాది జనవరి 1న కూడా గోల్డ్ మాన్ విజయ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. కర్ణాటకకు చెందిన మరో గోల్డెన్ మెన్ రవి 5 కేజీల బంగారు నగలు ధరించి తిరుమల శ్రీవారిని గతంలో ఓసారి దర్శించుకున్నారు. అలాగే గడ్డిపాటి సాంబశివరావు అనే మరో భక్తుడు కూడా శరీరంపై నగలు, మెడలో బంగారు గొలుసులు, చేతులకు స్వర్ణ కంకణాలు ధరించి తిరుమలకు రావడం .. ఆ ఫోటోలు, వీడియోలు ఇప్పటికి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *