Last Updated:
దక్షిణ ఇరాన్‌లోని కుహెస్తక్ నగరంలో జరుగుతున్న పెళ్లి వేడుకపై అమెరికా క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 50 మంది గాయపడ్డారు. ఈ దారుణ కాండపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది.
దక్షిణ ఇరాన్‌లోని సిరిక్ కౌంటీలో ఉన్న కుహెస్తక్ నగరంలో ఘోరం జరిగింది. ఒక నివాస గృహంలో జరుగుతున్న పెళ్లి వేడుకపై అమెరికా సేనలు క్షిపణితో దాడి చేశాయి. ఈ భయంకరమైన దాడిలో ఒక చిన్నారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఇరాన్ రెడ్ క్రెసెంట్ ప్రకటించింది. ఈ దారుణ ఘటనపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇదొక అత్యంత క్రూరమైన నేరమని అభివర్ణించింది. అమెరికా చేసిన ఈ దారుణ కాండకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.














