Last Updated:
ఇరాన్‌పై మరోసారి భీకర దాడికి ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైనికుల సెలవులన్నీ రద్దు చేస్తూ ప్రధాని నెతన్యాహూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మద్దతు లేకుండానే ఒంటరి పోరుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతుండటంతో మధ్యప్రాచ్యంలో మరో యుద్ధం తప్పదా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇరాన్‌పై మరోసారి భీకర దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ రక్షణ బలగాలకు చెందిన సెలవులన్నింటినీ ఇజ్రాయెల్ రద్దు చేసింది. సైనికులు వెంటనే విధుల్లో చేరాలని ఉన్నతాధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అమెరికా వైఖరితో విసుగు చెందిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇక ఒంటరిగానే ఇరాన్‌పై పైచేయి సాధించాలని నిర్ణయించుకున్నట్లు ఇజ్రాయెల్ ఛానల్ 13 వెల్లడించింది. అమెరికా ఈ యుద్ధం నుంచి బయటపడాలని చూస్తోందని, కేవలం వైమానిక దాడులతో ఇరాన్‌ను ఓడించలేమని అమెరికా జనరల్ డాన్ కేన్ భావిస్తున్నట్లు సమాచారం.














