Last Updated:
Varanasi Story Leak: మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా విడుదలైన వర్కింగ్ పిక్స్‌లో ‘రుద్ర’గా ఆయన లుక్ వైరల్ అవుతుండగా.. మరోవైపు సినిమాకు సంబంధించిన లీక్డ్ స్టోరీ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Varanasi Story Leak: సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే అనగానే ఫ్యాన్స్‌కి పండగే పండగ. ఈ బర్త్‌డే సందడిని మరింత పీక్స్‌కు తీసుకెళ్తూ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ నుండి అదిరిపోయే వర్కింగ్ పిక్స్ రిలీజ్ చేశారు. ఆఫ్రికా షెడ్యూల్లో తీసిన ఈ లేటెస్ట్ పిక్చర్స్‌లో మహేష్ బాబు ‘రుద్ర’ అవతార్ చూసి అభిమానుల మైండ్ బ్లాక్ అయిపోతోంది. ఆఫ్రికాలోని ప్రసిద్ధ కిలిమంజారో పర్వత ప్రాంతాలు, మాసాయ్ మారా దట్టమైన అడవుల బ్యాక్‌డ్రాప్‌లో వైల్డ్ నేచర్‌ను ఆస్వాదిస్తూ, వెదురు పడవలపై చలిస్తూ మహేష్ చాలా డిఫరెంట్‌గా కనిపించారు.














